నేచురల్‌ స్టార్‌ నాని, డైరెక్టర్‌ విక్రమ్‌ కె.కుమార్‌ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమా 'గ్యాంగ్ లీడర్'. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌(సివిఎం) నిర్మించారు. శుక్రవారం నాడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రదర్శించడంతో సినిమా ఎలా ఉందో సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు చెబుతున్నారు నెటిజన్లు. సినిమా చాలా డీసెంట్ గా ఉందని.. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సినిమాను ఫ్లాట్ గా తెరకెక్కించారని అంటున్నారు. 

ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో నింపేశారట. సినిమా ఎక్కడా బోర్ కొట్టలేదని కొందరు ట్వీట్లు చేస్తున్నారు. అయితే సెకండ్ హాఫ్ మాత్రం అంత గొప్పగా లేదని.. కొన్ని సన్నివేశాలు లాజిక్ లేకుండా ఉన్నాయని అంటున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే సినిమా ఏవరేజ్ గా ఉందనే టాక్ వినిపిస్తోంది.

సినిమాలో నాని పెర్ఫార్మన్స్ ఆకట్టుకుంటుందట. అనిరుధ్ నేపధ్య సంగీతం మరో ప్రధాన బలమని చెబుతున్నారు. ఇంటర్వల్ సీన్, ప్రీక్లైమాక్స్ బాగున్నాయని అంటున్నారు. విలన్ గా కార్తికేయ ఎంట్రీ ప్రేక్షకులకు నచ్చుతుందట.