షారూఖ్‌ ఖాన్‌ బుక్కయ్యాడు. మామూలుగా కాదు.. అడ్డంగా బుక్కైపోయాడు. సోషల్‌ మీడియాలో నెటిజన్లకి దొరికిపోయాడు. షారూఖ్‌ పెట్టిన ఒక్క పోస్ట్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతుంది. మతాల మధ్య వార్‌లా మారింది. మరి ఇంతకి షారూఖ్‌ ఏం చేశాడు, సోషల్‌ మీడియాలో దుమారానికి కారణమేంటనేది చూస్తే..

వినాయక చవితిని పురస్కరించుకుని అభిమానులకు, దేశ ప్రజలకు షారూఖ్ శుభాకాంక్షలు తెలిపారు. కుల, మతాలకు అతీతంగా ఆయన స్పందించారు. నుదుటుకి బొట్టు పెట్టుకుని ఓ సెల్ఫీని సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. `ప్రార్థనలు, నిమజ్ఞనం పూర్తయ్యాయి. మీపై.. మీ కుటుంబంపై ఎల్లప్పుడూ గణేశ ఆశీర్వాదాలు కురిపించాలి. సంతోషాన్నివ్వాలి. గణపతి బప్పా మోరియా` అంటూ షారూఖ్‌ విశెష్‌ తెలిపారు. 

ఓ మంచి ఉద్దేశంతో షారూఖ్‌ చేసిన ఓ గొప్ప పనిని కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. షారూఖ్‌ నువ్వు హిందువుగా మారావా?, మీరు ఏ వర్గానికి చెందిన వారో క్లారిటీ ఇవ్వండి?, మీరు పెట్టుకుంది కుంకుమ బొట్టేనా? పెయింట్‌ అ? దేవుడితో ఆటలాడితే శాపం తగులుతుంది? అని కొందరు, దేవుడు ఒక్కడే అని, అది అల్లా అని, షారూఖ్‌ ఇంతపని చేస్తావనుకోలేదని మరికొందరు ఆయనపై దుమ్మెత్తి పోశారు. 

అందరి బాగుకోసం షారూఖ్‌ పెట్టిన పోస్ట్ ని ఇలా తప్పుగా కామెంట్‌ చేస్తున్న వారిని మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆయనలోని మంచితనాన్ని తీసుకోండని కామెంట్‌ చేస్తున్నారు. షారూఖ్‌ మతానికి అతీతంగా గౌరీని వివాహమాడిన విషయం తెలిసిందే. కానీ కొందరు కావాలని ఆయనపై బురద జల్లడం విచారకరం. 

షారూఖ్‌ ఇంకా తన కొత్త ప్రాజెక్ట్ ని ప్రకటించలేదు. రెండేళ్ళ క్రితం `జీరో` చిత్రంలో నటించిన ఆయన ఆ సినిమా పరాజయం చెందడంతో ఇప్పటి వరకు కొత్త సినిమాని ప్రకటించలేదు. సిద్ధార్థ్‌ ఆనంద్‌తో ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్‌. అలాగే రాజ్‌ కుమార్‌ హిరానీతోనూ ఓ సినిమాకి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది.