Asianet News TeluguAsianet News Telugu

ఆకట్టుకుంటున్న స్వాతిముత్యం ట్రైలర్, బెల్లంకొండవారి రెండో హీరోకు కలిసివచ్చేనా...?

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా స్వాతిముత్యం. రిలీజ్ కు రెడీగా ఉన్న ఈమూవీ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్. 

Ganesh Bellamkonda Swathimuthyam Movie trailer Release
Author
First Published Sep 26, 2022, 2:11 PM IST

బెల్లంకొండ గణేష్ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ తో కలసి నిర్మిస్తున్న సినిమా స్వాతిముత్యం. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను లక్ష్మణ్.కె.కృష్ణ  డైరెక్ట్ చేశారు. ఈ ఈసినిమాతో లక్షణ్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. . కామెడీ బేస్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను విజయ దశమి కానుకగా అక్టోబర్ 5న రిలరీజ్ చేయబోతున్నారు మేకర్స్

 ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో స్వాతిముత్యం  ట్రైలర్ ను రిలీజ్ చేశారు టీమ్.  ఘనంగా జరిగిన ఈ ఈవెంట్ లో హీరో హీరోయిన్లు  గణేష్, వర్ష బొల్లమ్మ తో పాటు  నిర్మాత నాగ వంశీ, దర్శకుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. నిన్న నైట్ ఒక మూవీ చూశానండీ.. దాంట్లో కూడా హీరో, హీరోయిన్ మనలాగే కాఫీ షాప్ లో కలుస్తారు" అంటూ హీరోయిన్  వర్ష బొల్లమ్మ డైలాగ్స్ తో ట్రైలర్ స్టార్ట్ అవు తుంది. తొలి చూపులోనే గణేష్ ప్రేమలో పడటం, ఆమె కూడా గణేష్ ని తిరిగి ప్రేమించడం వంటి క్యూట్ సన్నివేశాలతో ట్రైలర్ సాగుతుండగా వారికి ఊహించని సమస్య వస్తుంది. ట్రైలర్ తోనే సినిమాపై ఇంట్రెస్ట్ పెంచేలా చేశారు మూవీటీమ్. మొత్తానికి ట్రైలర్   చూస్తుంటే ఫ్యామిలీ ఆడియన్స్ ను బాగా టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.

 

వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ.. మీ అందరికీ ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. డైరెక్టర్ లక్ష్మణ్ గారు స్మాల్ టౌన్ నుంచి వచ్చారు  వారిలో ఒక ఇన్నోసెన్స్ ఉంటుంది. ఆది ఆయనలోనూ, ఆయన రైటింగ్ లోనూ, ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. గణేష్ కిది మొదటి సినిమా అయినా చాలా అద్భుతంగా చేశాడు. ఆయన క్రమశిక్షణ, సెట్స్ అందరితో నడుచుకునే విధానం చాలా బాగుంది. గణేష్ కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను" అన్నారు.

గణేష్ మాట్లాడుతూ..  2020 లో కరోనా వచ్చిన టైంలో ఒక సినిమా స్టార్ట్ చేద్దామని కంగారు పడుతున్న టైంలో లక్ష్మణ్ వచ్చి ఈ కథ చెప్పాడు. ఈ కథ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్మి సితార బ్యానర్ దగ్గకు  తీసుకెళ్లడం జరిగింది. కథ వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పుకున్నారు. వంశీ గారికి నా కృతఙ్ఞతలు. నన్ను నేను మొదటిసారి బిగ్ స్క్రీన్ మీద చూసుకుంటున్నాను. టెన్షన్ గా ఉంది. ఏం చెప్పాలో, ఎలా ఉండాలో కూడా నాకు అర్థంకావట్లేదు. కానీ ట్రైలర్ లో చూసినట్టుగానే ఈ సినిమా చాలా సరదాగా.. మన ఇంట్లోనో, మన పక్కింట్లోనో జరిగే కథ లాగా ఉంటుంది. ఈ సినిమాను థియేటర్స్ లో మీరందరూ చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

గణేష్ ,వర్ష బొల్లమ్మ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో  ఇతరపాత్రల్లో సీనియర్ నటుడు నరేష్, రావు రమేష్, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్, పమ్మి సాయి, గోపరాజు రమణ, శివ నారాయణ, ప్రగతి, సురేఖావాణి, సునయన, దివ్య శ్రీపాద నటిస్తున్నారు. ఇప్పటికే హీరోగా గణేష్ అన్న శ్రీనివాస్ మంచి ఇమేజ్ సాధించాడు ఆయన బాలీవుడ్ లోకి వెళ్ళగా గణేష్ టాలీవుడ్ ను టార్గెట్ చేశాడు. ఇద్దరిని హీరోలుగా నిలబెట్టటానికి వారి తండ్రి బెల్లంకొండ సురేష్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios