సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక అంశం ట్రెండ్ లో ఉంటుంది. ఈ సందరర్భంగా బెంగాలీకి ఓ పల్లీ అమ్ముకునే వ్యక్తి పాడిన పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. తాజాగా బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య ఈ సాంగ్ కు స్టెప్పులేశారు.
ఈ ఏడాది పాటల సంవత్సరంగా పేరు పొందుతోంది. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ఫ’ సాంగ్స్ ఓ రేంజ్ లో ఊపూపుతున్నాయి. కాగా, దేవీ ప్రసాద్ అందించిన ‘శ్రీవల్లి’ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంటోంది.... అయితే తాజాగా సోషల్ మీడియాలో మరో పాట వైరల్ గా మారుతోంది.
వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని బీర్బమ్ జిల్లా లక్ష్మీ నారాయణ్ పూర్ పంచాయతీలోని దుబ్రజ్ పూర్ కాలనీకి చెందిన ‘బూబన్ బద్యాకర్’ పల్లీలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజంతా ఆయన శ్రమించి మూడు నుంచి నాలుగు కేజీల పల్లీలు అమ్మితే వచ్చే ఫలితం రూ.200. కానీ ఆయన పాటలోని మాధుర్యం వెలకట్టలేనిది. అయితే పల్లీలు అమ్మేందుకు బూబన్ బద్యాకర్ తానే స్వయంగా ఒక పాటను క్రియేట్ చేసి పాడుతున్నాడు. ‘మీ దగ్గర బంగారపు చైన్లు, గొలుసులు ఏమైనా ఉంటే నాకు ఇవ్వండి. అంతకు సమానమైన పల్లీలను మీరు తీసుకెళ్లండి. వేయించని పల్లీలు.. (కచ్చా బదాం).. నేను వీటిని వేయించలేదు. తియ్యగా ఉంటాయి..’ అంటూ బద్యాకర్ లిరిక్స్ రాసుకున్నాడు. ఈ పాటను విన్న ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు.
పదేండ్లుగా అదే పాటను పాడుతూ పల్లీలుు అమ్ముతున్నాడు. సాంగ్ వినసొంపుగా ఉండటంతో తమ ఏరియాలోని ఒకరు రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ టోన్ ను మరోకరు రీమిక్స్ చేసి ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ సాంగ్ దేశమంతటా వైరల్ అవుతోంది. పలువురు యూటూబ్ స్టార్లు, ఇన్ స్టాలో హైలీ ఫాలోవర్స్ ఉన్న యూసర్లు ఈ సాంగ్ కు స్టెప్పులేస్తూ తమ ఫాలోవర్లను ఖుషీ చేస్తున్నారు.
తాజాగా బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కూడా తనదైన స్టైల్ లో గ్రూప్ డ్యాన్స్ చేశారు. ‘సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న కచ్చా బాదమ్ సాంగ్ కు మ్యాచ్ అయ్యేలా నా స్టైల్ లో డ్యాన్స్’ అంటూ పేర్కొన్నారు గణేష్ ఆచార్య. మరోవైపు ఇంకా ఈ సాంగ్ వైరల్ అవుతూనే ఉంది.
