దండాలయ్య ఉండ్రాలయ్య.. జై జై గణేశా అంటూ.. గణపతి మండపాల్లో ఎక్కువగా వినిపించే గణేశుడి సినిమా పాటలు
వినాయకుడు.. విఘ్నాధిపతి.. గణనాథుడు.. బొజ్జ గణపయ్య.. ఏకదంతుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నో నామాలున్నాయి ఆయనకు. ఏ పేరుతో పలిచినా.. ఏవిధంగా పూజించిన కదలి వచ్చే గణేషుడికి.. సినిమాల్లో ప్రత్యేక స్థానం ఉంది. మరీ ముఖ్యంగా.. తెలుగుసినిమాలో ఆయనది ప్రత్యేక స్థానం. గణేష్ మండపాలు పెడితే.. ఎక్కువగా వినిపించే తెలుగు సినిమా గణపతి పాటలు ఏంటో చూద్దాం..?

జయ జయ శుభకర వినాయకా నుంచి.. జై జై గణేశ వరకూ.. ఎన్నో పాటలు.. గణపతిని స్తుతిస్తూ.. మండపాల్లో.. ఎన్నో ఏళ్లుగా కొన్ని పాటులు మారుమోగుతూనే ఉన్నాయి. . గణపతి బప్పా మోరియా అంటూ మాస్ స్టెప్స్ వేసినా, క్లాసికల్ పాటలతో అలరించినా.. అది తెలుగు ప్రేక్షకులకే దక్కింది. ఎందుకంటే తెలుగు సినిమాల్లో నే ఎక్కువగా వినాయకుని పాటల బయటకు వచ్చాయి. ప్రతీ పండపంలో మారుమోగుతున్నాయి. ఈ వినాయక చవితి సందర్భంగా టాప్ సాంగ్స్ లిస్ట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఏ ఇంట్లో అయినా.. గణపతి పాట అని అనగానే ముందుగా వినిపించేది వక్రతుండ మహాకాయ పాట. ఏ మండపంలో అయినా.. వినాయకచవితి సమయంలో వక్రతుండ మహాకాయ పాట వినిపించాల్సిందే. మోగాల్సిందే. బాలసుబ్రహ్మణ్యం పాడటం.. మధురంగా ఉండటం.. ఈ పాటను తెలుగు ప్రేక్షకులు అంతగా ఓన్ చేసుకున్నారు. దేవుళ్లు సినిమాలోని ఈ పాట గణేష్ గొప్పతనాన్ని వివరిస్తుంది. 'ప్రార్ధనా గీతంగా వెలుగుతోంది. ఇప్పటికీ శ్రవణ మరోహరంగా మిగిలిపోయింది.
గణేష్ పండగా అని అనగనే ప్రతీ ఒక్కరికి వినిపించే మరో పాటు.. దండాలయ్య ఉండ్రలయ్య దయుంచయ్య దేవ. విక్టరీ స్టార్ వెంకటేష్ నటించిన కూలీ నెం.1 చిత్రంలోనిది. ఈ పాటలో గణేష్ నిమజ్జనం సమయంలో వచ్చే పాట ఇది. వెంకటేష్, టబుని టీజ్ చేస్తూ సాగిన ఈపాట ప్రతి మండపంలో మార్మోమోగుతుంది. ‘దండాలయ్యా ఉండ్రాలయ్యా కరుణించయ్య దేవా, అంటూ సాగే ఈ పాటను కూడా ఆలపించింది బాల సుబ్రహ్మణ్యమే.
జై జై గణేశా జై కొడ్త గణేశా అంటూ సాగే పాట్ తెలుగులో బాగా హిట్ అయ్యింది. ఈ పాట జై చిరంజీవ సినిమాలోనిది. గణేష్ చతుర్థి రోజున ఈ పాట ప్రతి మండపంలో లూప్‌లో ఉంటుంది. ' జయములు ఇవ్వు బొజ్జ గణేశా' అని అంటూ సాగే ఈ పాటలో చిరంజీవి డాన్స్ చేయగా.. బాలసుబ్రహ్మణ్యం గారు తన గొంతు అందించారు.
ఇక తాజాగా బాలయ్య భగవంత్ సింగ్ కేసరి సినిమాలో కూడా గణపతి పాటను సెంటిమెంట్ గా పెట్టేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. బాలకృష్ణ డోలు భాజా పట్టుకుని.. అదిరిపోయే స్టెప్పులేస్తూ.. చూచేసిన డాన్స్ కు.. నందమూరి ఫ్యాన్స్ ఫిదా అవ్వడంతో పాటు.. స్టెప్పులేస్తూ.. కాలుకదుపుతున్నారు. అంతే కాదు బాలయ్య డిక్టెటర్ సినిమాలో కూడా ఇలానే గణేష్ పాటతో అలరించారు.
ఈ పాట 100% లవ్ సినిమాలోనిది. ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి పాడుకునే పాట ఇదని చెప్పవచ్చు. ఈ పాట సాంప్రదాయకమైన హాస్య కోణాన్ని కలిగి ఉంటుంది. ‘తిరు తిరు గణనాధ ది ది ది తై, ఆశీర్వదించు ఆ చదువులమ్మ తోడై అంటూ సాగిన ఈ పాటలో తమన్నా మెయిన్ రోల్లో కనిపిస్తుంది.
గణపతి బప్పామోరియా అంటూ సాగే ఈ పాట ఇద్దరమ్మాయిలతో సినిమాలోనిది. ఇది సాంప్రదాయ పాట కంటే ఆధునిక కాలపు పాటగా చెప్పవచ్చు. ఈ పాటను సూరజ్ జగన్ పాడారు. 'వక్రతుండ మహాకాయ గణపతి బప్పా మోరియా సూర్యకోటి సమ ప్రభ గణపతి బప్పా మోరియా' అంటూ ఈ పాట సాగుతుంది.
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్ రావు నటించిన రాగా సినిమా నుంచి వినాయక ప్రార్ధన బాగా ఫేమస్ అయ్యింది. ఈపాట క్లాసిక్ ట్యూన్ తో పాటు వెస్ట్రన్ ట్యూన్ కూడా కలిపి అద్భుతంగా సాగింది పాట. మహాగణపతిం మనసా స్మరామి అంటూ సాగే పాట.. మనస్సుకి ప్రశాంతతను ఇస్తుంది.
ఇవే కాదు.. రామ్ నటించిన గణేష్‌లో ‘రాజా మహారాజా', బాలకృష్ణ ‘డిక్టేటర్' సినిమాలోని ‘గంగంగం గణేషా', నాని - నాగార్జున ‘దేవదాస్'లోని ‘లక లక లకుమికరా' సహా ఎన్నో పాటలు తెలుగు సినిమాల్లో వచ్చాయి.టాలీవుడ్‌లోనే కాదు.. అన్ని భాషల్లో కలిపి ఇప్పటి వరకు చాలా సినిమాల్లో గణపతిపై పాటను వాడుకున్నారు. వీటిలో చాలా వరకు హిట్ చిత్రాలుగా నిలిచిన విషయం తెలిసిందే. అందుకే ఎన్నో ఏళ్లుగా ఆయనపై పాటను రూపొందిస్తూనే ఉన్నారు. అలాగే, చాలా సినిమాల్లో ముఖ్యమైన సన్నివేశాలను కూడా పెట్టుకుంటున్నారు. వీటినే గణేష్ నవరాత్రులు సందర్భంగా వాడుకుంటుండడం విశేషం.