Asianet News TeluguAsianet News Telugu

లిప్‌ లాక్‌లు సీన్లు అందుకే పెట్టాం.. గేమ్‌ ఆన్‌ డైరెక్టర్ క్లారిటీ.. `హ్యాపీ ఎండింగ్‌` అలాంటి మూవీ కాదట..

వచ్చే శుక్రవారం చిన్న సినిమాల జాతర ప్రారంభం కానుంది. నాలుగైదు సినిమాలు పోటీలో ఉన్నాయి. ఇందులో `గేమ్‌ ఆన్‌`, `హ్యాపీ ఎండింగ్‌` ప్రధానంగా ఉన్నాయి. మరి ఈ రెండింటిలో రచ్చ ఎవరిది?
 

game on director clarity on liplock and bold things revealed by happy ending  director arj
Author
First Published Jan 27, 2024, 11:41 PM IST

రొమాంటిక్‌ సీన్లు, లిప్‌ లాకులు ఇప్పుడు యంగ్‌ హీరోల సినిమాల్లో కామన్‌ అయిపోయింది. `యానిమల్‌` వంటి వాటిలోనూ శృతి మించినట్టు పెట్టారు. ఇటీవల `బబుల్ గమ్‌`లోనూ అవే. ఇప్పుడు అలాంటిదే మరో సినిమా `గేమ్‌ ఆన్‌` వస్తుంది. ఈ మూవీ ట్రైలర్‌లో లిప్‌ లాక్‌లు, రొమాంటిక్‌ సీన్లకి కొదవ లేదు. తాజాగా దీనిపై స్పందించారు దర్శకుడు దయానంద్‌. యూత్‌ని ఎట్రాక్ట్ చేసేందుకు కొన్ని ఎలిమెంట్లు పెట్టాల్సి వస్తుందని, అందుకే అవి పెట్టినట్టు చెప్పారు. చిన్న సినిమాలకు ఆడియెన్స్ ని తీసుకు రావడం చాలా కష్టం. అలాంటప్పుడు ఇలాంటి వాటిని అప్రోచ్‌ కావడంలో తప్పులేదన్నారు. అయితే ఆయా సీన్లు బలవంతంగా ఉండవని, ఆకట్టుకునేలా, ఆ ఫీల్‌ని పొందేలా ఉంటాయన్నారు. 

`గేమ్‌ ఆన్‌` సినిమా గురించి దర్శకుడు దయానంద్‌ చెబుతూ, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా, అన్నీ ఉంటూనే డిఫరెంట్ గా ఉండాలనుకుని ఈ మూవీ చేశా. చచ్చిపోదాం అనుకునే వ్యక్తి జీవితంలోకి ఒక గేమ్ ప్రవేశిస్తే అతని జీవితం ఎలా మారింది అనేది సినిమాటిక్ గా చూపించాం. ఒక్కొక్క టాస్క్ దాటుకుంటూ ముందుకు వెళ్తాడు. ఇలాంటి టాస్క్ లు తొమ్మిది ఉంటాయి. సెకండాఫ్ లో వచ్చే టాస్క్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక ట్రోమాలోకి వెళ్ళిపోయిన వ్యక్తికి ఈ గేమ్ ఏ విధంగా హెల్ప్ చేసిందనేది మెయిన్ కాన్సెప్ట్. రా అండ్ రస్టిక్ గా ఉంటుంది. యూత్ ను ఎట్రాక్ట్ చేస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా  ఉంటాయి. వాటిని టీజర్, ట్రైలర్ లో రివీల్ చేయలేదు. మధుబాల గారి క్యారెక్టర్ చాలా కొత్తగా, ఐకానిక్ గా ఉంటుంది.  నేహా సోలంకి పాత్ర చాలా మాసీగా ఉంటుంది. ఆమె క్యారెక్టర్ లో చాలా సర్ప్రైజ్లు ఉంటాయి. నిర్మాత రవి కస్తూరి ఎంతో ఫ్రీడమ్‌ ఇచ్చి నిర్మించారు. `గేమ్‌ ఆన్‌` ఒక కొత్తఫీలింగ్‌ని ఇస్తుంది` అని తెలిపారు. ఇందులో గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటించారు.  

`హ్యాపీ ఎండింగ్` క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ - దర్శకుడు కౌశిక్ భీమిడి

యష్ పూరి హీరోగా నటించిన కొత్త సినిమా "హ్యాపీ ఎండింగ్".  అపూర్వ రావ్ హీరోయిన్ గా నటించింది.  హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. యష్‌, అపూర్వ కౌశిక్‌ జంటగా నటించారు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించిన `హ్యాపీ ఎండింగ్` సినిమా ఫిబ్రవరి 2న గ్రాండ్ గా థియేటర్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ సందర్భంగా సినిమా హైలైట్స్ ను లేటెస్ట్ ఇంటర్వ్యూలో తెలిపారు దర్శకుడు కౌశిక్ భీమిడి.

`ఒక రోజు మహాభారతం చదువుతుంటే అందులో చాలా శాపాలు గురించి తెలిసింది. ఇలాంటి శాపాన్ని ఇప్పటి జెనరేషన్ కుర్రాడు ఎదుర్కొంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్ తో "హ్యాపీ ఎండింగ్" కథ మొదలైంది. ఇలాంటి మూవీస్ ఏవైనా తెలుగులో వచ్చాయా అని ఆలోచించాను. అప్పట్లో బాలకృష్ణ నటించిన ఒక సినిమా ఉంది కానీ ఈ మధ్య ఏదీ రాలేదు. దాంతో స్క్రిప్ట్ రైటింగ్ మీద దృష్టి పెట్టాను. పురాణాల నుంచి తీసుకున్న అంశం కాబట్టి..కథకు ట్రీట్ మెంట్ మాత్రం చాలా మోడరన్ గా ఉండాలని అనుకున్నాను. అప్పుడే ఈ జనరేషన్ ప్రేక్షకులకు సినిమాను రీచ్ చేయగలమని బిలీవ్ చేశాను.

"హ్యాపీ ఎండింగ్" ఒక మంచి రొమాంటిక్ డ్రామా. కథలో హీరోకు శాపం ఉంటుంది కాబట్టి అది అతనికి ట్రాజెడీ. కానీ చూసే ఆడియెన్స్ కు మాత్రం నవ్వుకునేలా ఉంటుంది. ఈ సినిమా పోస్టర్ లో హీరోయిన్స్ ను చూపించలేదు గానీ సినిమాలో వాళ్ల క్యారెక్టర్స్ చాలా కీలకంగా ఉంటాయి. నాకు కె విశ్వనాథ్, శేఖర్ కమ్ముల గారి మూవీస్ ఇష్టం. వారి సినిమాల్లో లేడీ క్యారెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాగే నేనూ ఈ మూవీలో హీరోయిన్స్ కు ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్స్ డిజైన్ చేశాను. చిన్నప్పుడే ఓ బాబా శాపం పొందిన ఓ యువకుడు ప్రేమలో పడితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటాడు అనేది చూపిస్తున్నాం. శాపం వల్ల తన పార్టనర్ తో ఫిజికల్ గా ఉండలేకపోయినా..అతను వేరే పద్ధతులతో తన ప్రేమను ఆమెపై చూపిస్తాడు. తన ప్రేయసిని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియజేస్తాడు. ఇప్పటిదాకా మన సినిమాల్లో రొమాన్స్, సన్నిహితంగా ఉండటాన్ని ఒకరకంగా చూపించాం. కానీ "హ్యాపీ ఎండింగ్"లో ఆ రొమాన్స్ డిఫరెంట్ గా ఉంటుంది. అయితే ఎక్కడా అసభ్యత లేకుండా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఎంటర్ టైనింగ్ తో సినిమా రూపొందించాను` అని తెలిపారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios