గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో రికార్డ్ కార్‌స్టార్క్ పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన హాలీవుడ్ ప్రముఖ నటుడు జాన్ స్టాల్ కన్నుమూశారు.
గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో రికార్డ్ కార్‌స్టార్క్ పాత్రతో ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన హాలీవుడ్ ప్రముఖ నటుడు జాన్ స్టాల్ కన్నుమూశారు.
ప్రముఖ హాలీవుడ్ స్టార్ జాన్ స్టాల్ మరణించారు. 68 ఏళ్ల వయస్సులో ఆయన ఈనెల 2న తుది శ్వాస విడిచారు. అయితే ఆయన చనిపోవడానికి కారణం మాత్రం ఇంత వరకు తెలియలేదు. జాన్ మరణ వార్త కూడా చాలా లేట్ గా తెలిసింది.జాన్ స్టాల్ మరణవార్తను ఆయన ఏజంట్ అమండా ఫిట్టాలాన్ హోవార్డ్ అధికారికంగా ఓ ప్రకటనలో వెల్లడించారు.
జాన్ అద్భుతమైన టాలెంట్ ఉన్న నటుడు మాత్రమే కాదు ఆయన స్కాటీష్ రంగస్థల నటులలో ఒక వెలుగు వెలిగిన వారు. జాన్ స్టాల్ ఏజంట్ చెప్పిన ప్రకారం ఆయన మార్చ్ 2న స్కాటిష్ లోని ఐల్ ఆఫ్ లూయిస్‌లో మరణించాడు. అక్కడ అతను తన భార్య జేన్ పాటన్‌తో కలిసి ఉంటున్నారు. చాలా సూధీర్ఘంగా నడిచిన స్కాటీష్ సోప్ ఒకేరా టెక్ ది హై రోడ్ లో ఆయన కనిపించాడు 1982 లో స్టార్ట్ అయిన ఈ షో 2003 వరకూ కొనసాగింది. చివరి వరకూ ఆయన ఇందులో నటించారు.
