ఎంతో కాలంగా ఎదురుచూస్తోన్న గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఫైనల్ సిరీస్ 8 త్వరలో వెబ్ వరల్డ్ లోకి అడుగుపెట్టబోతోంది. ఇదే చివరి సిరీస్ కావడంతో వరల్డ్ వైడ్ గా అభిమానుల గుండెల్లో కౌంట్ డౌన్ మొదలైంది. ఏప్రిల్ 14నుంచి మొదలు కానున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయినా ఏకైక వెబ్ సిరీస్ ఇదే. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ వెబ్ సిరీస్ కు బిగ్గెస్ట్ ఫ్యాన్. 

ఇకపోతే ఈ సారి ప్రసారం కాబోయే సిరీస్ రన్ టైమ్ లలో చాలా మార్పులు  చేశారు. ఎప్పుడు లేని విధంగా చివరి రెండు ఎపిసోడ్ లు 80 నిమిషాల వరకు ఉండడం విశేషం. ఆ సిరీస్ రన్ టైమ్ లపై ఓ లుక్కేస్తే.. 

ఎపిసోడ్ 1 : 54 నిమిషాలు 

ఎపిసోడ్ 2 : 58 నిమిషాలు 

ఎపిసోడ్ 3 : 60 నిమిషాలు 

ఎపిసోడ్ 4 : 78 నిమిషాలు 

ఎపిసోడ్ 5 : 80 నిమిషాలు 

ఎపిసోడ్ 6 : 80 నిమిషాలు 

HBO ఛానెల్ నిర్మించిన ఈ 18+ వెబ్ సిరీస్ ను ఇండియాలో హాట్ స్టార్ ప్రసారం చేయనుంది.