Asianet News TeluguAsianet News Telugu

`గేమ్‌ ఛేంజర్‌` నుంచి దసరా ట్రీట్‌ ఇదే.. రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ కి సంబరాలే!

రామ్‌ చరణ్‌ హీరోగా నటిస్తున్న `గేమ్‌ ఛేంజర్‌` చిత్రం నుంచి ఇప్పటి వరకు కంటెంట్‌ పరంగా ఎలాంటి అప్‌డేట్లు రాలేదు. ఇప్పుడు ఎట్టకేలకు ట్రీట్‌ ప్లాన్‌ చేశారట. 

game changer dussehra treat ready to ram charan fans arj
Author
First Published Oct 17, 2023, 2:11 PM IST | Last Updated Oct 17, 2023, 2:13 PM IST

శంకర్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌.. `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ట్రీట్‌ రాలేదు. టైటిల్‌ గ్లింప్స్ తప్ప, కంటెంట్‌కి సంబంధించిన ఎలాంటి అప్‌ డేట్‌ లేదు. ఆ మధ్య హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతున్న విషయాన్ని ప్రకటించారు. కానీ ఈ చిత్రం ఎంత వరకు వచ్చిందనేది చెప్పలేదు. అలాగే కంటెంట్‌ పరంగా గ్లింప్స్ గానీ, టీజర్‌గానీ విడుదల చేయలేదు. 

దీంతో ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఎలాంటి కథని దర్శకుడు శంకర్‌ చెప్పబోతున్నారు, రామ్‌చరణ్‌ని ఎలా చూపించబోతున్నారనేది ఆద్యంతం ఆసక్తికరంగా, అదే సమయంలో పెద్ద సస్పెన్స్ గా మారింది. రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ నుంచి చాలా రోజులుగా అప్డేట్‌ కోసం డిమాండ్‌లు కూడా ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు స్పందన లేదు. నిర్మాత దిల్‌రాజు కూడా ఎలాంటి అప్‌డేట్లు ఇవ్వలేదు. ఏదైనా శంకర్‌ నుంచి రావాల్సిందే అని చెప్పారు. 

అయితే ఎట్టకేలకు అప్‌డేట్లు ఇస్తున్నారు. ఈ చిత్రం నుంచి దసరా ట్రీట్‌రాబోతుందట. ఈ విజయదశమి సందర్భంగా `గేమ్‌ ఛేంజర్‌` నుంచి ఓ సాంగ్‌ని విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఊపు తెచ్చేలా ఈ పాట ఉంటుందని తెలుస్తుంది. రామ్‌చరణ్‌ ఫ్యాన్స్ దసరాకి సంబరాలు చేసుకునేలా ఉండబోతుందని అంటున్నారు. అయితే కంటెంట్‌ పరమైన గ్లింప్స్ గానీ, టీజర్‌గాని ఉండబోదని, కేవలం పాట మాత్రమే రిలీజ్‌ చేస్తారని, ఇలా నెమ్మదిగా ప్రమోషన్స్ షురూ చేయబోతున్నారని టాక్‌. 

ఇక ఈ చిత్రాన్ని పొలిటికల్ థ్రిల్లర్‌గా  తెరకెక్కిస్తున్నారట శంకర్‌. ఇందులో చరణ్‌ రెండు పాత్రలు చేస్తున్నారని, ఒకటి రాజకీయ నాయకుడి(సీఎం)గా, మరోటి ఐఏఎస్‌ ఆఫీసర్‌గా అని తెలుస్తుంది. ఇప్పటికీ ఈ రెండు గెటప్‌లకు సంబంధించిన ఫోటోలు లీక్‌ అయ్యాయి. ఇక ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. శ్రీకాంత్‌, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌రాజు దాదాపు 300కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ చేయబోతున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios