Tollywood Update : దుబాయిలో గ్రాండ్ గా గామా అవార్డ్స్.. ఆసక్తికరంగా ‘మార్కెట్ మహాలక్ష్మి’ టీజర్!

టాలీవుడ్ కు సంబంధించిన అప్డేట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. దుబాయిలో తెలుగు అవార్డ్స్ ను అందించడం విశేషం. ఆసక్తికరంగా ‘మార్కెట్ మహాలక్ష్మి’ టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. 
 

Gama Awards in Dubai and Market Maha Lakshmi Teaser Tollywood Update NSK

దుబాయ్‌లో ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్  గామా తెలుగు మూవీ అవార్డ్స్ 4th ఎడిషన్ అంగరంగ వైభవంగా జరగనుంది. మార్చి 3న దుబాయ్ లోని జబిల్ పార్క్ లో ప్రెస్టీజియస్ గా ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ గామా అవార్డ్స్ వేడుక నిర్వహించనున్నారు. ఏ ఎఫ్ ఎం ప్రాపర్టీస్ సారధ్యంలో గామా అవార్డ్స్ చైర్మన్ కేసరి త్రిమూర్తులు గారు ఈ వేడుకను నిర్వహించబోతున్నారు. శుక్రవారం ఈ వేడుకకు సంబంధించి కర్టెన్ రైజర్ కార్యక్రమం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జ్యూరీ చైర్మన్ గా వ్యవహరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కోటి,  జ్యూరీ సభ్యులు విఎన్ ఆదిత్య,  రఘు కుంచె, నిర్మాత డీవీవీ దానయ్య, దర్శకులు సాయి రాజేష్, ప్రసన్న,  హీరోయిన్ డింపుల్ హయతి,గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్, ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ సుశీల్, ఫణి మాధవ్ కలిసి ఈ అవార్డుకు సంబంధించి ట్రోఫీను లాంచ్ చేశారు.

Gama Awards in Dubai and Market Maha Lakshmi Teaser Tollywood Update NSK

2021, 2022, 2023 లో విడుదలైన చిత్రాలనుంచి - బెస్ట్ యాక్టర్(మేల్, ఫిమేల్), బెస్ట్ మూవీ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సింగర్ (మేల్, ఫిమేల్), బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సెలబ్రిటీ సింగర్, వంటి వివిధ కేటగిరీలకు అవార్డ్స్ అందజేయనున్నామన్నారు.  దర్శకుడు కోటీ, వీఎన్ ఆదిత్య, నిర్మాత డీవీవీ దానయ్య, రఘు కుంచే, గామా అవార్డ్స్ సీఈవో సౌరభ్ మాట్లాడారు. ఈ అవార్డ్స్ లో డింపుల్ హయతి పెర్ఫార్మన్స్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉండనుంది. 

‘ఆస్కార్ పురస్కారం అందుకున్న కీరవాణి, చంద్రబోస్‌ల‌కు ప్రత్యేకంగా ‘గామా గౌరవ్ సత్కార్’తో పాటు, ప్రఖ్యాత గాయకులు SP బాలసుబ్రహ్మణ్యం స్మృతిగా ‘గామా SPB గోల్డెన్ వాయిస్ అవార్డు’ను గాయకులు మనోకి అందిస్తున్నామని  గామా అవార్డ్స్ దర్శకులు ప్రసన్న పాలంకి తెలియజేశారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు సుకుమార్,  బాబీ,  బుచ్చిబాబు సానా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్,  సంగీత దర్శకులు, దేవి శ్రీ ప్రసాద్,  ఎస్ ఎస్ తమన్, ఎం ఎం శ్రీలేఖ, రఘు కుంచె, అనూప్ రుబెన్స్,  గాయకులు మనో, ధనుంజయ్..  ఇంకా ఎందరో సినీ హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, గాయనీ గాయకులు, కమెడియన్లు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.

‘మార్కెట్ మహాలక్ష్మి’ టీజర్ సూపర్బ్ : హీరో శ్రీ విష్ణు

Gama Awards in Dubai and Market Maha Lakshmi Teaser Tollywood Update NSK

‘కేరింత’ మూవీ ఫెమ్ హీరో పార్వతీశం, డెబ్యూ యాక్ట్రెస్ ప్రణీకాన్వికా జంటగా నటిస్తున్న చిత్రం 'మార్కెట్ మహాలక్ష్మి'. వియస్ ముఖేష్ యువ దర్శకత్వంలో, ప్రొడ్యూజర్ అఖిలేష్ కలారు ఈ చిత్రాన్ని నిర్మించారు. బి2పి స్టూడియోస్ ద్వారా తెరకెక్కిన ఈ చిత్రంలో హర్ష వర్ధన్, మహబూబ్ బాషా, ముక్కు అవినాష్ ప్రధాన పాత్రలో పోషించనున్నారు. ఈ మూవీ 'టీజర్' ని టాలీవుడ్ హీరో శ్రీ విష్ణు (Sree Vishnu)  లాంచ్ చేశారు. అనంతరం  సినిమా టీజర్ గురించి మాట్లాడారు. హీరో & హీరోయిన్ క్యారెక్టరైజెషన్ బాగుందన్నారు. ఈ చిత్రంతో డైరెక్టర్ వీఎస్ ముఖేష్ చేసిన కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకున్నారు.  

హీరో  పార్వతీశం మాట్లాడుతూ: మా సినిమా టీజర్ ని రీలిజ్ చేసినందుకు శ్రీ విష్ణుకి నా కృతజ్ఞతలు. మా టీజర్ మీకు నచ్చితే పది మందికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను` అని చెప్పారు. కమెడియన్ మహబూబ్ బాషా మాట్లాడుతూ, హీరో శ్రీ విష్ణు గారు మా సినిమా టీజర్ ని లాంచ్ చేసినందుకు నేను చాలా హ్యాపీ. ఎందుకంటే, మార్కెట్ మహాలక్ష్మి లాంటి సబ్జెక్ట్ ఓరియెంటెడ్  కధలు శ్రీ విష్ణు గారు గతంలో చాలానే చేశారు, చేస్తూనే ఉన్నారు. సో, మా సినిమా టీజర్ అలాంటి వ్యక్తి ద్వారా రీలిజ్ కావడం నాకు ఆనందంగా ఉంది. పైగా, అయన నాకు ఎంతో ఇష్టమైన హీరో` అని తెలిపారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios