Asianet News TeluguAsianet News Telugu

`గం గం గణేశా` నిర్మాత తెరవెనుక కథ.. బండి సరోజ్‌ కోసం విశ్వక్‌ సేన్‌.. ఒరిజినల్‌ సాంగ్‌లో `బలగం` బ్యూటీ..

ప్రొడక్షన్‌ పెద్ద రిస్క్ అంటున్నాడు `గంగంగణేశా` నిర్మాత. యూట్యూబర్‌ బండి సరోజ్‌ కోసం విశ్వక్‌ సేన్‌ రాగా, `బలగం` బ్యూటీ కావ్య కళ్యాణ్‌ రామ్‌ ఒరిజినల్‌ సాంగ్‌ లో మెరిసింది. 
 

gam gam ganesh producer interesting story vishwak sen for bandi saroj kumar and kavya kalyan ram music album arj
Author
First Published May 27, 2024, 11:53 PM IST

ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన "గం..గం..గణేశా" సినిమాతో నిర్మాతగా టాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు నిర్మాత వంశీ కారుమంచి. హైలైఫ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో తన స్నేహితుడు కేదార్ సెలగంశెట్టితో కలిసి ఆయన ఈ సినిమాను నిర్మించారు. యాక్షన్ క్రైమ్ కామెడీ మూవీగా దర్శకుడు ఉదయ్ శెట్టి రూపొందించిన "గం..గం..గణేశా" ఈ నెల 31న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను, నిర్మాతగా తన అనుభవాలను ఇంటర్వ్యూలో తెలిపారు నిర్మాత వంశీ కారుమంచి. యూఎస్‌లో ఐటీ కంపెనీ రన్‌ చేస్తున్న ఆయన లాక్‌ డౌన్‌లో ఇండియాకి వచ్చి అనుకోకుండా ప్రొడక్షన్‌లోకి వచ్చి ఈ మూవీని నిర్మించినట్టు తెలిపారు. 

gam gam ganesh producer interesting story vishwak sen for bandi saroj kumar and kavya kalyan ram music album arj

ప్రొడక్షన్‌ చాలా రిస్క్ అని, కానీ దాన్ని తీసుకోవాలని, సక్సెస్‌ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా సినిమాల చేస్తానని తెలిపారు. ఆనంద్‌తో చేసిన `గంగం గణేశా` మూవీ పెద్ద హిట్‌ అవుతుందనే నమ్మకంతో ఉన్నామని తెలిపారు. `బేబీ`తో ఈ మూవీని పొల్చవద్దు అని, అది వేరు ఇది వేరు అని, యాక్షన్‌తోపాటు కామెడీ నవ్విస్తుందని తెలిపారు. నెక్ట్స్ విజయ్‌ దేవరకొండతో సుకుమార్‌ సినిమా చేస్తామని తెలిపారు. నా అభిమాన నటుడు బాలకృష్ణతో సినిమా నిర్మించే అవకాశం వస్తే అదొక వరంలా భావిస్తా అని తెలిపారు నిర్మాత వంశీ కారుమంచి. 

సాంగ్‌ ఆల్బమ్‌లో `బలగం` బ్యూటీ కావ్య కళ్యాణ్‌ రామ్‌..

`బలగం` చిత్రంతో పాపులర్‌ అయ్యింది నటి కావ్య కళ్యాణ్‌ రామ్‌. ఇప్పుడు ఒరిజినల్‌ సాంగ్‌ ఆల్బమ్‌లో మెరిసింది. VYRL సౌత్ అనేది యూనివర్శల్ మ్యూజిక్ ఇండియా నుండి వచ్చిన ఒక ప్లాట్‌ఫాం, సౌత్ ఇండియాలో ఐపాప్ మ్యూజిక్ కల్చర్ ని పరిచయం చేసి, దానికంటూ ఒక బేస్ ఉండేలా కృషి చేస్తుంది. ఒరిజినల్ కంటెంట్ తో, అర్ధ వంతమైన మ్యూజిక్ తో, క్లట్టర్ బ్రేకింగ్ స్లిక్ వీడియోస్ తో ఐపాప్ మ్యూజిక్ కోసం ఎదురు చూసే మ్యూజిక్ లవర్స్ అందరికీ ఏకైక డేష్టినేషన్ Vyrl సౌత్. ఈ లేబుల్ తన మొదటి రెండు సింగిల్స్ విడుదలతో తెలుగు సంగీత రంగంలో సంచలనాత్మక ప్రవేశం చేసింది. రెండు పాటలు సంగీత ప్రియుల హృదయాలను గెలిచి ఇంటర్నెట్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి.

gam gam ganesh producer interesting story vishwak sen for bandi saroj kumar and kavya kalyan ram music album arj

మొదటి సింగిల్ "ఓసెలియా," కి గణేష్ క్రోవ్విది, రిక్కీ బి మరియు ఫిరోజ్ ఇజ్రాయెల్ సంగీతం అందించగా, ఇటీవల టాలీవుడ్ సంచలనం కావ్య కళ్యాణ్ రామ్ నటించారు. ఈ మెలోడీ ట్రాక్ వేగంగా చార్ట్‌బస్టర్‌గా మారి, మెలోడీ సంగీత ప్రేమికులను లోతుగా ఆకట్టుకుంది. ఈ విజయాన్ని పురస్కరించుకుని, Vyrl సౌత్ తన రెండవ సింగిల్, "సిన్నదాని సూపులే"ని విడుదల చేసింది. టెలివిజన్ సెన్సేషన్ శ్రీ సత్య, వినోద్ కుమార్ ఎస్ నటించిన ఈ పాట అద్భుతమైన విజువల్స్ తో వినడానికి శ్రవణానందంగా ఉంది. ఈ పాటకి యాడిక్రీజ్ సంగీతం అందించడంతో పాటు, సిన్నదాని సుపులే సాంగ్ లో కనిపించారు కాదు, వీరితో పాటు సాకేత్ కొమండురి, దాసరి మేఘన నాయుడు కూడా ఈ పాటలో పెర్ఫార్మన్స్ చేశారు. ఈ సాంగ్‌ కూడా ట్రెండింగ్‌లోకి వస్తుందని తెలిపింది టీమ్‌.  

 బండి సరోజ్ కుమార్ `పరాక్రమం` సినిమా కోసం మాస్‌ కా దాస్‌..
బి ఎస్ కె మెయిన్ స్ట్రీమ్ పతాకంపై బండి సరోజ్ కుమార్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా `పరాక్రమం`. శృతి సమన్వి, నాగ లక్ష్మి, మోహన్ సేనాపతి, నిఖిల్ గోపు, అనిల్ కుమార్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల 'పరాక్రమం' సినిమా టీజర్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, దర్శకులు బుచ్చిబాబు, జ్ఞానసాగర్ ద్వారక, నిర్మాత ఎస్ కేఎన్ అతిథులుగా పాల్గొని టీమ్‌ని అభినందించారు. 

gam gam ganesh producer interesting story vishwak sen for bandi saroj kumar and kavya kalyan ram music album arj

దర్శకుడు బండి సరోజ్ కుమార్ మాట్లాడుతూ , నేను 2004లో జూనియర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీకి వచ్చాను. చిన్నప్పుడు టీవీలో చిరంజీవిని చూశాకే నాకు సినిమా గురించి తెలిసింది. ఆ తర్వాత ఇళయరాజా, సిరివెన్నెల సీతారామశాస్త్రి, పీసీ శ్రీరామ్, శ్రీకర్ ప్రసాద్ ఇలాంటి వాళ్లంతా నన్ను ఇన్స్ పైర్ చేశారు. నేను దర్శకుడిగా రెండు తమిళ చిత్రాలు, ఒక తెలుగు సినిమా చేశా. అవి మూడూ డిజాస్టర్స్ అయ్యాయి. నేనొక ఫెయిల్యూర్ డైరెక్టర్ నని తెలుసుకున్నా. అప్పుడు నేనే నటించాలని డిసైడ్ అయ్యి నిర్భందం, నిర్భందం 2, మాంగళ్యం సినిమాలు చేశాను. కల నాది వెల మీది కాన్సెప్ట్ లో యూట్యూబ్ లో ఆ సినిమాలను ఉంచాను. అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి చాలా రెస్పాన్స్ వచ్చింది. వారందరి సపోర్ట్ తో ఎంకరేజ్ మెంట్ తో `పరాక్రమం` సినిమా చేశాను. నాకు ఇండస్ట్రీలో నచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎస్ కేఎన్, బుచ్చిబాబు గారు, విశ్వక్ సేన్. ఈ ముగ్గురూ ఇవాళ మా టీజర్ రిలీజ్ కార్యక్రమానికి గెస్టులుగా రావడం సంతోషంగా ఉంది` అని తెలిపారు.  
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios