Asianet News TeluguAsianet News Telugu

ఆలియా భట్ కు హాలీవుడ్ నుంచి స్పెషల్ విషెష్. వండర్ వుమెన్ ఏమన్నదంటే...?

ఆలియా భట్ ప్రెగ్నెంట్ అని తెలియగానే వరుసగా శుభాకాంక్షల్ వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ నుంచి, సౌత్ నుంచి స్టార్స్ ఆమెను విష్ చేస్తున్నారు. ఇక ఇక్కడి నుంచే కాకుండా.. హాలీవుడ్ నుంచి కూడా ఆలియాకు విషెష్ వస్తున్నాయి. 
 

Gal Gadot Sends Love To Alia As She Announces Pregnancy
Author
Hyderabad, First Published Jun 27, 2022, 7:16 PM IST

ఆలియా భట్ ప్రెగ్నెంట్ అని తెలియగానే వరుసగా శుభాకాంక్షల్ వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ నుంచి, సౌత్ నుంచి స్టార్స్ ఆమెను విష్ చేస్తున్నారు. ఇక ఇక్కడి నుంచే కాకుండా.. హాలీవుడ్ నుంచి కూడా ఆలియాకు విషెష్ వస్తున్నాయి. 

బాలీవుడ్ న‌టి ఆలియా భ‌ట్ ఇవాళ ఓ తీపి క‌బురు చెప్పిన విష‌యం తెలిసిందే. త‌న ఇన్‌స్టా పోస్టులో ఆమె త‌ల్లికాబోతున్న‌ట్లు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో ఆలియాకు కంగ్రాట్స్ మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఓ ప్రత్యేక వ్య‌క్తి నుంచి కూడా ఆలియా విషెస్ మెసేజ్ అందింది. హాలీవుడ్ మూవీలో న‌టిస్తున్న తోటి న‌టి గాల్ గాడెట్ కంగ్రాట్స్ చెబుతూ ఆలియాకు మెసేజ్ చేసింది. వండ‌ర్ వుమెన్ చిత్రంతో గాల్ గాడెట్  ఫేమ‌స్ అయిన విష‌యం తెలిసిందే. 

ఆలియా, ర‌ణ్‌బీర్ పెళ్లి స‌మ‌యంలోనూ గాల్ గాడెట్ త‌న ఇన్‌స్టాలో ఆ జంట‌కు ప్ర‌త్యేకంగా కంగ్రాట్స్ చెప్పింది. డేవిడ్ ఎలిసన్‌తో పాటు . గాల్ గ్యాడెట్, ఆమె భ‌ర్త జేర‌న్ వార్స‌నో సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా గంగూబాయి చిత్రంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆలియా త్వరలోనే నెటిఫ్లిక్స్‌లో హాలీవుడ్‌ సినిమాతో గ్రాండ్‌ ఎంట్రీ ఇవ్వనుంది. 

బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే. ఇక అలియా భట్ రెండు నెలల క్రితమే ఏప్రిల్ లో తన ప్రియుడు, బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది. వీరిద్దరూ తమ మ్యారేజ్ లైఫ్ ని అన్యోన్యంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరూ బ్రహ్మాస్త్ర చిత్రంలో కలసి నటిస్తున్నారు. అలియా, రణబీర్ ఇద్దరూ బాలీవుడ్ స్టార్ కపుల్స్. వీరిద్దరూ ఎక్కడ కనిపించినా అభిమానులకు కనుల పండుగలా ఉంటుంది.

తాజాగా అలియా భట్ సూపర్ న్యూస్ ని అభిమానులకు తెలిపింది. ఫ్యాన్స్ కి ఈ న్యూస్ షాక్ తో పాటు సర్ ప్రైజ్ ఇచ్చింది. త్వరలో అలియా భట్ తల్లి కాబోతోంది. అలియా, రణబీర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు. అలియా భట్ ఈ శుభవార్తని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా క్షణాల్లో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ నుంచి, నెటిజన్ల నుంచి అలియా భట్ కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చెకప్ చేయించుకున్న తర్వాత హాస్పిటల్ బెడ్ పై నుంచి అలియా ఈ న్యూస్ ఫ్యాన్స్ కి తెలియజేసింది. హాస్పిటల్ బెడ్ పై ఉన్న పిక్ ని కూడా పంచుకుంది. అలియా పక్కనే ఆమె భర్త రణబీర్ కపూర్ కూడా ఉన్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios