Asianet News TeluguAsianet News Telugu

'మసూద', 'గాలోడు' లో దేనికి ఎక్కువ కలెక్షన్స్ తెలిస్తే షాకే

 ఏ సినిమా వీకెండ్ లో బాగా ఫెరఫార్మ్ చేస్తుందని అంచనా వేసారో దానికి కలెక్షన్స్ లేవు... విశ్లేషకులు పెద్దగా పట్టించుకోని సినిమాకు అదిరిపోయే ఓపినింగ్స్, కలెక్షన్స్ ఉన్నాయి.అవేంటో చూద్దాం.

Gaalodu outperformed Masooda over the weekend
Author
First Published Nov 21, 2022, 3:04 PM IST


ఈ వారం ఎప్పటిలాగే చిన్న సినిమాలతో థియేటర్లు బిజీ అయ్యాయి.  ఓ ప్రక్క క్రితం వారం రిలీజైన  సమంత 'యశోద' సందడి కొనసాగుతోంది. గత శుక్రవారం విడుదలైన ఆ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. అదే సమయంలో ఈ శుక్రవారం చెప్పుకోదగ్గ సినిమాలే వచ్చాయి.  హీరో హీరోయిన్లు, బడ్జెట్ వంటి వాటి పరంగా.. చిన్న సినిమాలు కావచ్చు. కానీ, కంటెంట్ పరంగా చూస్తే క్యూరియాసిటీ క్రియేట్ చేసాయి.  వాటిల్లో ఏ సినిమా వీకెండ్ లో బాగా ఫెరఫార్మ్ చేస్తుందని అంచనా వేసారో దానికి కలెక్షన్స్ లేవు... విశ్లేషకులు పెద్దగా పట్టించుకోని సినిమాకు అదిరిపోయే ఓపినింగ్స్, కలెక్షన్స్ ఉన్నాయి.అవేంటో చూద్దాం.
 
ఈ వారం తెలుగు ప్రేక్షకులకు హారర్ థ్రిల్ ఇవ్వడానికి వచ్చిన సినిమా 'మసూద' (Masooda Movie). ఇంట్రస్టింగ్ గా వదిలిన ట్రైలర్ సినిమాపై ఆసక్తి కలిగించింది. సినిమా కూడా కొత్త బ్యాక్ డ్రాప్ లో తెలిసున్న కథనే చెప్పింది.  ఓ ముస్లిం అమ్మాయికి దెయ్యం పడుతుంది. దాన్ని వదిలించడానికి క్షుద్రపూజలు చేయాలని, అమ్మాయితో రక్త సంబంధం ఉన్న ఇద్దరు మగవాళ్ళ రక్తం కావాలని పూజ చేయించే వ్యక్తి చెబుతారు. రక్తం ఇచ్చారా? లేదా? అమ్మాయి నివసించే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న కృష్ణ అనే వ్యక్తి ఎలాంటి సాయం చేశాడు? అనేది కథగా నడిచింది. అక్కర్లేని కామెడీని పెట్టకుండా, హారర్ జానర్‌కు కట్టుబడి ఉన్నందుకు మేకర్స్‌ను మెచ్చుకున్నారు.  హారర్ కొత్త పద్ధతిలో స్టోరీ ను చెప్పడం జరిగింది. సంగీత ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో తిరువీర్, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా నటించారు. 'మళ్ళీ రావా', 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' తర్వాత రాహుల్ యాదవ్ నక్కా నిర్మించిన చిత్రమిది.  ఈ కొత్తదనం సినిమాకి ప్లస్ అయ్యింది అని చెప్పాలి. అయితే ఈ సినిమా  అనుకున్న స్దాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోతోంది.

హైదరాబాద్ లో మసూదా కలెక్షన్స్ బాగున్నాయి. ఈ సినిమా తెలంగాణా,ఆంధ్రాలలో మూడు రోజుల్లో కలిపి రూ. 1.45 కోట్ల షేర్ వసూలు చేసింది. మరో ప్రక్క ఇదే సినిమాతో పాటు రిలీజైన చిత్రం గాలోడు. మాస్ సినిమాగా రిలీజైన ఈ సినిమాలో సుడిగాలి సుధీర్ నటించారు. అతనికి ఉన్న ఫ్యాన్ బేస్ కలిసొచ్చింది. దాంతో ఓపినింగ్స్ బాగా వచ్చాయి. ఈ మూడు రోజుల్లో ఆంధ్రా,తెలంగాణాలలో కలిపి రెండు కోట్ల షేర్ వచ్చింది. సుడిగాలి సుధీర్‌కు బుల్లితెరపై ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. వెండితెరపై అసలైన మాస్ హీరోగా ఎదిగేందుకు ప్రయత్నాలు చేస్తూన్న క్రమంలో వచ్చిన సినిమా ఇది.  ఫుల్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో ఉన్న గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  గాలోడు సినిమాకు అంతా తానై ముందుండి చూసుకున్నాడు సుధీర్. ఫైట్స్, యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా అన్నింట్లోనూ సుధీర్ మెప్పించాడు. ఈ చిత్రానికి సుధీర్ బ్యాక్ బోన్‌లా నిల్చున్నాడు. సుధీర్ ఫ్యాన్స్‌కు మాత్రం మీల్స్‌లా అనిపిస్తుంది. నటన, కామెడీ ఇలా ప్రతీ విషయంలో అభిమానులను మెప్పిస్తాడు.

Follow Us:
Download App:
  • android
  • ios