‘సర్కారు వారి పాట’ చిత్రంలోని ‘కళావతి’ సాంగ్ ఇంకా ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ సాంగ్ కు సెలబ్రెటీలు సైతం ఫిదా అవుతున్నారు. మహేశ్ బాబును అనుకరిస్తూ కళావతికి స్టెప్పులేస్తున్నారు. తాజాగా నటి పూర్ణ కూడా సెన్సేషనల్ సాంగ్ కళావతికి డాన్స్ చేశారు. ఇందుకు హీరోయిన్ ప్రియమణి పూర్ణను ప్రశంసించింది.
సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu), డైరెక్టర్ పరశురామ్ పెట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రంలో మహేశ్ బాబు సరసన కీర్తి సురేష్ (Keerthy Suresh) నటించింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రొమాంటిక్ సాంగ్ ‘కళావతి’ని రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరు సాంగ్ ట్రైండ్ అవుతూనే ఉంది. ఇప్పటిే ఈ సాంగ్ ఇటు సోషల్ మీడియాలో, ఇంటర్నేట్ లో మారుమోగుతోంది. థమన్ (Thaman) క్యాచీ టూన్ ఇవ్వడం, సిద్ధ్ శ్రీరామ్ గాత్రం, అనంత శ్రీ రామ్ రాసిన లిరిక్స్ కు తెలుగు ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. అలాగే స్టార్ కొరియో గ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ సాంగ్ ను డైరెక్ట్ చేశారు. ట్రెండీ స్టెప్పులతో, ఆకట్టుకునే డాన్స్ మూమెంట్స్ ఉండటం మరింత ట్రెండ్ అవుతోంది. సెలబ్రెటీలు, ఫ్యాన్స్ మహేశ్ బాబను అనుకరిస్తూ సాంగ్ కు స్టెప్పులేస్తున్నారు.
గతంలో మహేశ్ బాబు డాటర్ సితార (Sithara), కీర్తి సురేశ్, ఇటీవల థమన్ (Thaman), కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Shekar Master) కూడా డాన్స్ చేశారు. తాజాగా ఢీ బ్యూటీ, నటి పూర్ణ కూడా మహేశ్ బాబును అనుకరిస్తూ స్టెప్పులేశారు. ఆ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసి తన అభిమానులతో పంచుకుందీ బ్యూటీ. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే పూర్ణ.. మహేశ్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట హిట్ సాంగ్ కు డాన్స్ చేయడంతో నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అలాగే హీరోయిన్ ప్రియమణి (Priyamani) కూడా పూర్ణ డాన్స్ మూమెంట్స్ కు ఆశ్చర్యపోయారు. ఆ వీడియోను లైక్ చేసి ప్రశంసించింది. ‘ఇటీవల నాకు ఇష్టమైన సాంగ్’ అంటూ నోట్ రాసింది.
కళావతి సాంగ్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. 50 మిలియన్ వ్యూస్ ను చేరుకునే దిశగా పరుగులు పెడుతోంది. సాంగ్ రిలీజ్ అయ్యి పది రోజులైనా ఇంకా ట్రెండింగ్ లోనే ఉండటం విశేషం. థమన్ క్యాచీ ట్యూన్, రొమాంటిక్ లిరిక్స్, సిద్ధ్ శ్రీ రామ్ వాయిస్ అందించడంతో ఇంతటి క్రేజ్ ను దక్కించుకుంది. కాగా మే 12 సర్కారు వారి పాట మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. బ్యాకింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి పరుశురామ్ పెట్ల దర్శకత్వం వహించారు. హీరోహీరోయిన్లుగా మహేశ్ బాబు, కీర్తీ సురేష్, ఇతర తారాగణం కీలక పాత్రలో నటిస్తోంది.
