Asianet News TeluguAsianet News Telugu

'మహానాయకుడు'ని బలవంతంగా రుద్ధబోతున్నారా..?

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్.. 'ఎన్టీఆర్ బయోపిక్' కి రెండు భాగాలుగా చిత్రీకరించారు. మొదటి భాగం 'కథానాయకుడు'కి ఏవరేజ్ టాక్ వచ్చింది. సినిమా ఎక్కువ రోజులు థియేటర్ లో ఆడలేదు. 

free shows for ntr mahanayakudu movie
Author
Hyderabad, First Published Feb 27, 2019, 10:01 AM IST

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్.. 'ఎన్టీఆర్ బయోపిక్' కి రెండు భాగాలుగా చిత్రీకరించారు. మొదటి భాగం 'కథానాయకుడు'కి ఏవరేజ్ టాక్ వచ్చింది. సినిమా ఎక్కువ రోజులు థియేటర్ లో ఆడలేదు. రెండో భాగం 'మహానాయకుడు'కి మొదటి రోజే ఫ్లాప్ టాక్ రావడంతో జనాలు థియేటర్ కి వెళ్లడం లేదు.

మూడే మూడు రోజుల్లో ఈ సినిమా సీన్ మొత్తం అయిపోయింది. మల్టీప్లెక్స్ లలో కూడా సినిమా టికెట్లు తెగడం లేదు. అయితే ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సినిమా అందరూ కచ్చితంగా చూడాలని పార్టీ జనాలకు చెబుతున్నాడట. దీంతో బుధవారం నుండి చందాలు వేసుకొని షోలను నడిపిస్తున్నారు. 

దీంతో పెయిడ్ షోలు పెరిగిపోయాయి. కొందరు టీడీపీ నేతలు టికెట్లు కొని జనాలకు పంచిపెడుతున్నారు. నిన్న జర్నలిస్ట్ లు , వారి కుటుంబాలకు టికెట్లు ఫ్రీగా ఇచ్చారు. అలా రోజుకొక వర్గం వారికి టికెట్లు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది.

కొందరు మొహమాటానికి టికెట్లు తీసుకున్నా.. థియేటర్ కి మాత్రం వెళ్లడం లేదట. అంటే సినిమాపై ఎంత నెగెటివిటీ ఏర్పడిందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఇప్పుడు బలవంతంగా రుద్దే ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!

Follow Us:
Download App:
  • android
  • ios