బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. తొలుత హిందీలో మొదలైన ఈ షో ఇప్పుడు అన్ని భాషల్లోనూ అలరిస్తోంది. ఇప్పటి వరకు తెలుగులో మూడు సీజన్లు పూర్తి చేసుకోగా.. నాలుగో సీజన్ కోసం సిద్ధమౌతోంది.

ఇప్పటి వరకు టెలికాస్ట్ అయిన మూడు సీజన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కాగా.. త్వరలోనే నాలుగో సీజన్ మొదలుకానుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.. కానీ.. దీనికి సంబంధించిన రోజుకో ఊహాగానం వినపడుతోంది.

దీనికి హోస్టుగా ఎవరు వ్యవహరిస్తారా అనే విషయం కూడా తీవ్రంగా చర్చజరుగుతోంది. కొందరు నాగార్జున హోస్ట్ గా చేస్తారంటూ చెబుతుండగా.. మరికొందరు.. సమంత కూడా హోస్ట్ గా చేస్తుందని చెబుతున్నారు.

కాగా.. తాజాగా ఈ సీజన్ లో నలుగురు అందమైన హాట్ హీరోయిన్లు పాల్గొంటున్నారటూ ఓ వర్త సర్క్యూలేట్ అవుతోంది. ఆ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలీదు కానీ... ఈ నలుగురు బ్యూటీలు బుల్లితెర పై కనపడితే మాత్రం ప్రేక్షకులకు పండగే.

వాళ్లు మరెవరో కాదు.. శ్రద్ధా దాస్, యామినీ భాస్కర్, ప్రియా వడ్లమణి, హంసా నందని. ఈ నలుగురు బ్యూటీలు పలు సినిమాల్లో హీరోయిన్లుగా నటించారు. శ్రద్దా దాస్, హంసా నందిని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఇక ప్రియా వడ్లమణి.. హుషారు సినిమాతో ఇఫ్పటికే కుర్రాళ్లకు బాగా గుర్తిండిపోయింది.  ఇక యామిణి భాస్కర్.. నాగశౌర్య నర్తనశాల సినిమాలో నటించింది.

అయితే..అనుకున్నంతగా కెరీర్ లో రాణించలేకపోయారు.  కానీ.. అందంలోనూ మాత్రం వీళ్లు ఎవరికీ తీసిపోరు. దీంతో.. వీరు కనుక షోలో పాల్గొంటే.. అభిమానుల ఆనందాలకు అవదులు ఉండవు. వీరి రాకతో.. బిగ్ బాస్ 4లో గ్లామర్ డోస్ పెరిగే అవకాశం కచ్చితంగా ఉంది.