తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. 

తారకరత్న కోసం విదేశా నుంచి స్పెషల్ గా డాక్టర్లను తీసుక‌ువచ్చినట్టు ఆయన ఫ్యామిలీ నుంచి నందమూరి రామకృష్ణ తెలిపారు. గుండె పోటుతో బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు టాలీవుడ్ హీరో..నందమూరి నటవారసుడు తారకరత్న. ఆయన కోసం విదేశీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యుడు నందమూరి రామకృష్ణ తెలిపారు. విదేశీ వైద్యులను రప్పించి చికిత్స అందిస్తున్నట్టు పేర్కొన్నారు. హార్ట్ ప్రాబ్లమ్ ను క్లియర్ చేస్తూనే.. నాడీ సమస్యలకు వారు ట్రీట్మెంట్ చేస్తున్నట్టగా తెలుస్తోంది.

గత నెల 27న తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు కుప్పం వెళ్లారు తారకరత్న. అక్కడ ఆమనకు సివియర్ గా గుండెపోటు రావడంతో అక్కడిక్కడే కుప్పకూలిపోయారు. దాంతో ఆయన్ను మొదట కుప్పంలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు.. అక్కడ ఫస్ట ఎయిడ్ చేసిన తరువాత.. పరిస్థితి మెరుగుపడకపోవడంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ట్రీట్మెంట్ అందిస్తూనే ఉన్నారు. 

మొదటగా తారకరత్నపరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు ప్రకటించారు. వైద్యులు ఎంతో శ్రమించి ఆయన ఆరోగ్య పరిస్థితిన కొలిక్కి తీసుకువచ్చారు. ఈక్రమంలో ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడినట్టు తెలుస్తోంది. తారకరత్న పరిస్థితి తెలిసి.. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తో పాటు చంద్రబాబు నాయుడు..నందమూరి కుటుంబ సభ్యులు బెంగళూరు వచ్చి ఆయన్ను పరామర్శించారు. 

ఇక ఇప్పుడు మెరుగైన వైద్యం కోసం చేయవల్సిన పనులన్నీ చేస్తున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో మరింత మెరుగైన చికిత్స కోసం ఆయనను విదేశాలకు తరలిస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఇప్పుడు విదేశాల నుంచే వైద్యులను మాత్రమే రప్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.