ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేల. దసరా మూవీతో తన సత్తా ఏంటో చాటి చెప్పాడు. ఈసినిమా చూడటానికి జనాలుపోటీపడుతున్నారంటే.. దర్శకుడి ప్రతిభ అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈసందర్భంగా నిర్మాత నుంచి కాస్ట్లీ గిఫ్ట్ ను అందుకున్నాడు దర్శకుడు. 

నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా.. మాస్ పాత్రల్లో సందడి చేసిన సినిమా దసరా. శ్రీకాంత్ ఓదేలు డైరెక్ట్ చేసిన ఈసినిమా మార్చ్ 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నానీ ఫస్ట్ టైమ్ ఈసినిమాతో పాన్ ఇండియాకు వెళ్లాడు. ఈక్రమంలో ఈసినిమా దేశవ్యాప్తంగా సూపర్ సక్సెస్ సాధించింది. శ్యామ్ సింగ రాయ్ తరువాత సక్సెస్ కోసం చూస్తున్న నానికి అదరిపోయే హిట్ ఇచ్చింది. కీర్తి సురేష్ కు బాలీవుడ్ లో ఇమేజ్ ను తీసుకువచ్చింది. నానీ మార్కెట్ ను పెంచింది. 

ఫస్ట్ టైమ్ ఈసినిమాలో డీ గ్లామర్ లుక్ లో కనిపించారు నానీ, కీర్తి సురేష్. ఈ పాత్రలు.. సన్నివేశాలు జనాలకు బాగా నచ్చేశాయి. దాంతో ఆడియన్స్ సినిమాను బాగా ఆదరించారు. ఇక ఈమూవీ సక్సెస్ తో టీమ్ యమా ఖుషీగా ఉంది. నాని కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్‌లు సాధించిన సినిమాగా నిలిచింది. కమర్షియల్‌గానే కాదు ఈ సినిమాలో నటుల గురించి వాళ్ల నటన గురించి ప్రతీ ఒక్కరు గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలా టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌ అయ్యాడు. 

ఇక హీరో నాని ముందు నుంచి శ్రీకాంత్‌ ఓదెలా పై నమ్మకంగా ఉన్నాడు. అతని పనితీరును ఎప్పటికప్పుడు మెచ్చుకుంటూనే వస్తున్నాడు. నెక్స్ట్ బిగ్‌ థింగ్‌ శ్రీకాంత్‌ ఓదెలా అని కామెంట్స్ కూడా చేశాడు. దానికి ఏ మాత్రం తీసిపోని విధంగా శ్రీకాంత్ పేరు కూడా ఇక్కడే కాదు పక్క రాష్ట్రాల్లోనూ వినిపిస్తుంది. ఇక ఇదిలా ఉంటే తాజాగా శ్రీకాంత్‌కు దసరా నిర్మాత సుధాకర్‌ చెరికూరి కాస్ట్లీ కారును బహుమతిగా ఇచ్చాడని సమాచారం. ఈ సినిమా సక్సెస్ తో దిల్ ఖుష్ అయిన నిర్మాత.. 80 లక్షలు విలువజేసే బీఎండబ్ల్యూ కారును శ్రీకాంత్ కు గిఫ్ట్‌గా ఇచ్చాడట. అంతేకాదు మూవీ టీమ్ అంతటికి గోల్డ్ కాయిన్స్‌ కూడా బహుకరించాడట ప్రొడ్యూసర్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియావో వైరల్ అవుతోంది. 

ఇక ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది దసరా సినిమా. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈసినిమా.. లాభాల బాటలో దూసుకుపోతోంది. ఇప్పటి వరకు 92 కోట్లకు పైగా గ్రాస్‌ ను కలెక్ట్ చేసిన దసరా సినిమా...ఈరోజుతో.. వంద కోట్లు మార్క్‌ దాటుతుందన్న నమ్మకంతో ఉన్నారు టీమ్. ఇక ఈసినిమాలో నాని, కీర్తిసురేష్ తో పాటు ప్రధాన పాత్రల్లో కన్నడ నటుడు దీక్షిత్‌ శెట్టి, పూర్ణ నటించారు.