ప్రతీ సినిమా ముందు పూరి జగన్నాథ్ స్క్రిప్టు రైటింగ్ కోసం బ్యాంకాంక్ కు వెళ్లటం చాలా ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ సారి అలా చేయలేదు. అందుతున్న సమాచారం మేరకు ఆయన గోవా వెళ్లి అక్కడ స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసుకుని వస్తున్నారు.
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఫామ్ లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాథ్ తన తదుపరి చిత్రం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తన పాత పద్దతులను స్వస్ది చెప్పి కొత్తగా ట్రై చేస్తున్నాడు. అందులో ఒకటి బ్యాంకాంక్ క్యాంప్. ప్రతీ సినిమా ముందు పూరి జగన్నాథ్ స్క్రిప్టు రైటింగ్ కోసం బ్యాంకాంక్ కు వెళ్లటం చాలా ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ సారి అలా చేయలేదు. అందుతున్న సమాచారం మేరకు ఆయన గోవా వెళ్లి అక్కడ స్క్రిప్టు వర్క్ ఫినిష్ చేసుకుని వస్తున్నారు.
అలాగే మొదటినుంచీ హీరో క్యారెక్టరైజేషన్‌లు తీర్చిదిద్దడంలో పూరి జగన్నాథ్‌కు పెట్టింది పేరు. అయితే ఈ సారి దృష్టి మొత్తం స్క్రిప్టులో కథాంశం మీదే పెడుతున్నారట. ఇస్మార్ట్ శంకర్ లాగానే కథలోనే ఓ విభిన్నత ఉండబోతోందంటున్నారు. ప్రస్తుతం యూత్‌లో ఎనర్జిటిక్‌గా దూసుకెళ్తున్న పేరు విజయ్ దేవరకొండ. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయబోతున్నరంటే వచ్చే క్రేజ్ ని అంచనా వేయటం కష్టమే. దాన్ని దృష్టిలో పెట్టుకునే స్క్రిప్టుపై ఎక్కువ కష్టపడుతున్నారట పూరి.
డియర్ కామ్రేడ్ ఫ్లాప్ కావటంతో విజయ్ కూడా పూరి సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాకు ‘ఫైటర్’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. విజయ్ యాటిట్యూడ్‌కి, పూరి మార్క్ టేకింగ్‌కు ఈ టైటిల్ అయితే పర్ఫెక్ట్ అని భావిస్తున్నారట. ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ డ్రామాతో పాటు, తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హీరో’ సినిమాల్లో నటిస్తున్నాడు విజయ్. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే పూరి సినిమా పట్టాలెక్కనుంది. పూరి, చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
