ఒకప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమా అంటే ప్రేక్షకులలోనే కాదు...సినిమావాళ్లలోనూ క్యూరియాసిటీ భీబత్సంగా ఉండేది. ఎందుకంటే దిల్ రాజు కథ ఓకే చేసాడంటే ఆచి తూచి అడుగులు వేస్తాడనే నమ్మకం. డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఎంత రేటు అయినా ఇచ్చి దిల్ రాజు సినిమాని సొంతం చేసుకునేవారు. ఇక ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తే కాసుల వర్షమే. అయితే సీన్ మారింది.

జనరేషన్ గ్యాప్ వచ్చేస్తోంది. లేటేస్ట్ యూత్ పల్స్ ని ఆయన పట్టుకోలేకపోతున్నట్లు ఆయన సినిమా రిజల్ట్ లు మొహమాటం లేకుండా చెప్తున్నాయి. రీసెంట్ గా  దిల్ రాజు బ్యానర్ లో వచ్చిన రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన  లవర్ మూవి డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత ఈ తరానికి పెద్దగా ఎక్కని..సంప్రదాయాలు, విలువలు అంటూ రూపొందించిన పెళ్లి వీడియో ..శ్రీనివాస కళ్యాణం కూడా డిజాస్టర్ అయ్యింది.

ఇదిగో ఇప్పుడు హలో గురు ప్రేమ కోసమే కూడా కలెక్షన్స్ విషయంలో చాలా డ్రాప్ కనపడుతోంది. ఓవర్ సీస్ లో అయితే బాగా తేడా కొట్టేసింది. ఇక్కడ తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా సినిమా కలెక్షన్స్ డ్రాప్ అవటం బయ్యర్లను కంగారు పెడుతోంది. మొదటి రోజు మీడియాని మ్యానేజ్ చేసి హిట్ టాక్ తెచ్చినా...ఆ ఇంపాక్ట్ సోమవారం నుంచే మాయమైపోయింది.

దాంతో ఇక్కడ కలెక్షన్స్ కు ఊపు తేవాలని...విజయయాత్రలు పెడుతున్నారు దిల్ రాజు. మొదట ఆంధ్రాలో ఆ తర్వాత తెలంగాణాలో ఈ విజయయాత్రలు మొదలెట్టబోతోంది టీమ్. అయితే విజయయాత్రలు అనేది ఓల్డ్ కాన్సెప్టు గా మారింది. ఇప్పుడెవరూ పెద్దగా స్పందించటం లేదు. ఈ నేపధ్యంలో దిల్ రాజు ...ఏ డెసిషన్ తీసుకుని తిరిగి తన విజయ ప్రస్దానాన్ని కొనసాగిస్తాడు అనేది పెద్ద ప్రశ్నే.