Asianet News TeluguAsianet News Telugu

ఐదేళ్లకి మోక్షం, 'స్టార్ మా' కు కలిసొచ్చింది

తమిళ చిత్రం ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’). ఈ సినిమా విజువల్ ఫీస్ట్ గా ఉన్నా కాస్ట్ ఫెయిల్యూర్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకుంది. దాదాపు ఐదేళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా  దాదాపు రెండున్నరేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దాదాపు రూ. 180 కోట్లు ఖర్చయింది.  

Five Years Back Manoharudu Sensation on Star Maa
Author
Hyderabad, First Published Aug 7, 2020, 1:28 PM IST

సాంకేతికంగా, కథాపరంగా ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తే చిత్రాలను రూపొందించే దర్శకుడు శంకర్, విక్రమ్ హీరోగా రూపొందించిన తమిళ చిత్రం ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’). ఈ సినిమా విజువల్ ఫీస్ట్ గా ఉన్నా కాస్ట్ ఫెయిల్యూర్ ఫిల్మ్ గా పేరు తెచ్చుకుంది. దాదాపు ఐదేళ్ల క్రితం రిలీజైన ఈ సినిమా  దాదాపు రెండున్నరేళ్ళకు పైగా నిర్మాణంలో ఉన్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి దాదాపు రూ. 180 కోట్లు ఖర్చయింది.  

 ఏ.ఆర్. రెహమాన్ (సంగీతం), పి.సి. శ్రీరామ్ (ఛాయాగ్రహణం), ఆంటోనీ (ఎడిటింగ్), పీటర్ హెయిన్స్ (ఫైట్స్) లాంటి ప్రతిభావంతులు ఈ ‘ఐ’ చిత్ర రూపకల్పనలో కీలక భూమికలు పోషించారు. మేకప్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి విభాగాలకు విదేశీ నిపుణులు సేవలందించారు. అయితేనేం ఈ సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ఇన్నేళ్లుగా అమ్ముడుపోలేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంభందించిన అన్ని ఇష్యూలు క్లియర్ అయ్యి...స్టార్ మా ఛానెల్ వారు క్రితం వారం టెలీకాస్ట్ చేసారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీమియర్ షోకు 11.1 రేటింగ్స్ వచ్చి ఆశ్చర్యపరిచింది. అంటే ఇన్నేళ్ల తర్వాత కూడా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ తగ్గలేదన్నమాట.
 
ఇక అప్పట్లోనే ఈ సినిమా చైనాలో ఏకంగా 15 వేల థియేటర్లలో విడుదల అయ్యింది. సినిమాలపై, థియేటర్లపై ప్రభుత్వ నియంత్రణ ఉండే చైనాలో విడుదలైన తొలి దక్షిణ భారతీయ భాషా చిత్రంగా ‘ఐ’ చరిత్రకెక్కంది. గతంలో విక్రమ్‌తో ‘అన్నియన్’ (తెలుగులో ‘అపరిచితుడు’), కమలహాసన్‌తో ‘దశావతారం’ చిత్రాలను నిర్మించిన ‘ఆస్కార్ ఫిలిమ్స్’ అధినేత వి. రవిచంద్రన్ ఈ నిర్మించారు.  

 ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో చెప్పే మాట ‘ఐ’ సినిమా విజువల్స్, లోకేషన్స్, మేకప్ టెక్నాలజీ అత్యద్బుతంగా ఉన్నాయి.  బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ అంటే హాలీవుడ్ సినిమాలే అని చెప్పుకునే వారికి మన ఇండియన్ సినిమాలు హాలీవుడ్ కి ఏ మాత్రం తీసిపోవు అనే రేంజ్ లో విజువల్స్ చూపించారు శంకర్. అయితే  ‘ఐ’ సినిమా విజువల్స్ పరంగా ఎంత గ్రాండ్ గా ఉన్నా చెప్పే కథలో దమ్ములేకపోకపోవటంతో చాలా మంది ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వలేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios