Asianet News TeluguAsianet News Telugu

తెలుగు స్టేట్స్ లో ‘లవ్ టు డే’ అదిరిపోయే కలెక్షన్స్.. ఐదు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే?

కంటెంట్ బాగుంటే ఏభాష చిత్రాన్నైనా తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల  ప్రేక్షకుల ముందుకు వచ్చిన  ‘లవ్ టు డే’ మూవీకి మంచి ఆదరణ లభిస్తోంది. బాక్సాఫీస్ వద్ద కూడా సందడి చేస్తోంది. ఇప్పటి వరకు ఎంత కలెక్ట్ చేసిందంటే.?
 

five dasy Collections of Love Today movie in Telugu States!
Author
First Published Nov 30, 2022, 5:13 PM IST

తమిళంలో రూపొందిన రొమాంటిక్ కామెడీ డ్రామా‘లవ్ టుడే’ తెలుగులోనూ దుమ్ములేపుతోంది. యువ దర్శకుడు, నటుడు  ప్రదీప్ రంగనాథన్ నటించిన Love Todayకు తెలుగు ప్రేక్షకు ల నుంచి కూడా అద్భుతమైన స్పందన  లభిస్తోంది. ఈనెల 4న తమిళనాడులో రిలీజ్ అయిన  ఈ చిత్రం  భారీ  సక్సెస్ ను అందుకుంది. దీంతో తెలుగులో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు (Dil Raju) నవంబర్ 25న రిలీజ్ చేశారు. ఈ రొమాంటిక్ కామెడీ డ్రామాకు ఇక్కడా మంచి రెస్పాన్సే దక్కుతుండటం విశేషం. 

మరోవైపు కలెక్షన్ల పరంగా  కూడా అదరగొడుతోందీ చిత్రం. రూ. 5 కోట్లతో రూపొందించగా రూ.70 కోట్లు  వసూళ్లు చేసింది. ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో రిలీజ్ చేసిన తర్వాత బాక్సాఫీస్ వద్ద ‘లవ్ టుడే’మళ్లీ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఐదురోజుల్లో రూ. 7.4 కోట్ల షేర్ వసూల్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు  అంచనాలు  వేస్తున్నాయి. అంటే తెలుగు స్టేట్స్ లోనూ లాభాల బాటలో నడుతోంది. ఇప్పటికే  1.5 కోట్ల ఫ్రాఫిట్ దక్కినట్టు తెలుస్తోంది. ఇదే జోష్ కొనసాగిస్తే మరింతగా కలెక్ట్ చేసే అవకాశం ఉంది.

అయితే,  డిసెంబర్ 2న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘హిట్ 2’ రిలీజ్ అవుతుండటంతో ఈ చిత్రం కలెక్షన్లు భారీ తగ్గే అవకాశం ఉంది. అప్పటికీ తట్టుకోగలితే వచ్చే నెలంతా థియేటర్లలో సందడి చేస్తుందని అంటున్నారు. ఇక ప్రదీప్ రంగనాథన్ కు ఇక్కడ గుర్తింపు దక్కడంతోపాటు.. ఆయన బిహేవియర్ కూడా బాగుందంటూ ఆడియెన్స్ లోటాక్ వచ్చింది. దీంతో ప్రదీప్ తో దిల్ రాజ్ ఓ సినిమాను కూడా లాక్ చేసినట్టు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై మరింత క్లారిటీ రావాలంటే మరిన్ని రోజులు ఆగాల్సిందే. 

Follow Us:
Download App:
  • android
  • ios