ఈ సినిమా తొలి నాలుగు రోజులు మంచి వసూళ్లు సాధించింది. చెక్ కన్నా ఓపినింగ్స్ ,కలెక్షన్స్ బాగున్నాయి. భాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా స్పీడు, జోరు చూసి కచ్చితంగా నితిన్ మరో సక్సెస్ అందుకుంటాడని అంతా లెక్కలేసారు. అయితే 4 రోజుల తర్వాత రంగ్ దే డ్రాప్ మొదలైంది, ఆ స్పీడు పడిపోయింది.
వారం క్రితం నితిన్ రంగ్ దే, రానా అరణ్య, సింహ కోడూరి తెల్లవారితే గురువారం సినిమాలు విడుదల అయ్యాయి. మిగతా రెండింటి కన్నా నితిన్ రంగ్ దే బెస్ట్ అనిపించింది. అరణ్య, తెల్లవారితే గురువారం సినిమాలు మరీ డిజాస్టర్స్ అయ్యిపోయాయి. రానా అరణ్య పర్లేదని రివ్యూలు వచ్చినా రంగ్ దే కమర్షియల్ గా కాస్త కలెక్షన్స్ దండుకుంది. అయితే ఈ సినిమా తొలి నాలుగు రోజులు మంచి వసూళ్లు సాధించింది. చెక్ కన్నా ఓపినింగ్స్ ,కలెక్షన్స్ బాగున్నాయి. భాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా స్పీడు, జోరు చూసి కచ్చితంగా నితిన్ మరో సక్సెస్ అందుకుంటాడని అంతా లెక్కలేసారు. అయితే 4 రోజుల తర్వాత రంగ్ దే డ్రాప్ మొదలైంది, ఆ స్పీడు పడిపోయింది.
సెలవులు లేకపోవడం.. కరోనా కేసులు పెరిగిపోతుండటంతో రంగ్ దే కలెక్షన్స్‌పై భారీ ప్రభావమే పడిందని చెప్పాలి. మొత్తం వారం అంతా కలిపి చూస్తే బాగా తక్కువ కలెక్షన్స్ అని తేలింది. వారం పూర్తయ్యేసరికి..రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 11 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. కానీ టార్గెట్ భారీగా ఉండటంతో నితిన్‌కు మరో ఫ్లాప్ తప్పేలా కనిపించడం లేదు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 24 కోట్లు వసూలు చేయాలి.
ఈ వీకెండ్ లో కూడా చాలా చోట్ల ఈ చిత్ర కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. దాంతో నితిన్ సినిమా బ్రేక్ ఈవెన్ చేరుకుంటుంది అనుకోవడం అత్యాశే. దానికి తోడు వైల్డ్ డాగ్, సుల్తాన్ లాంటి సినిమాలు రావడంతో నితిన్ సినిమాపై ఇంట్రస్ట్ కూడా తగ్గిపోయింది. ఎలా చూసుకున్నా కూడా నితిన్‌కు రంగ్ దే రూపంలో మరోసారి నిరాశ తప్పలేదు.
‘రంగ్ దే' మూవీ ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 800 థియేటర్లలో విడుదల అయింది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. పాటలు సంగీత ప్రియులను మరింత ఆకట్టుకున్నాయి. డీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు. దిగ్గజ సినిమాటోగ్రాఫర్ పి.సి.శ్రీరామ్ ఈ సినిమాకు కెమెరామన్‌గా పనిచేసారు.
