ప్రతి రంజాన్ కి ఓ మూవీ విడుదల చేయడం సల్మాన్ ఖాన్ కి అలవాటు. గత ఏడాది లాక్ డౌన్ కారణంగా సల్మాన్ మూవీ విడుదల చేయలేదు. దీనితో సల్మాన్ ఖాన్ నుండి  సినిమా వచ్చి చాలా రోజులే అవుతోంది. దీంతో రాధే సినిమాతో థియేటర్స్లో దిగుతున్నాడు సల్మాన్ ఖాన్.

 ప్రభుదువా దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ తాజాగా విడుదలయ్యింది.  సల్మాన్ రాధే ట్రైలర్ విపరీతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. సల్మాన్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా అదరగొట్టారు. కాగా ట్రైలర్ లో సల్మాన్ ఖాన్ హీరోయిన్ దిశా పటానిని ముద్దు పెట్టకున్నారు.

సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ తో లిప్ లాక్ సన్నివేశాలలో  పాల్గొన్న దాఖలాలు లేవు. ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉండే సల్మాన్‌.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 32 ఏళ్లు అవుతున్నా ఇప్పటివరకు ఒక్క హీరోయిన్‌తోనూ  ముద్దు సీన్‌లో నటించలేదు. అలాంటిది రాధే ట్రైలర్‌లో హీరోయిన్‌ దిశా పటానీతో సల్మాన్‌ లిప్‌లాక్‌ సీన్‌ చూసిన ఆయన ఫ్యాన్స్‌ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.