Asianet News TeluguAsianet News Telugu

ఫస్ట్ టైమ్ తెలుగులో గేమ్‌ బేస్డ్ మూవీ.. అనుకున్న గేమ్‌ రివర్స్ అయితే..

తెలుగులో మొదటి సారి గేమ్‌ బేస్డ్ మూవీ రాబోతుంది. `గేమ్‌ ఆన్‌` పేరుతో ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను టీమ్‌ వెల్లడించింది. 

first time in telugu game based movie game on pre release event arj
Author
First Published Jan 30, 2024, 11:11 PM IST

గేమ్‌ బేస్డ్ గా సినిమాలు రావడం చాలా అరుదు. హాలీవుడ్‌, ఇతర కంట్రీస్లో ఇలాంటివి అడపాదడపా వస్తుంటాయి. కానీ మన తెలుగులో మాత్రం రాలేదనే చెప్పాలి. హీరో, విలన్‌ మధ్య టామ్‌ అండ్‌ జెర్సీలా సాగుతుంటాయి. కానీ ఓ గేమ్‌లా మాత్రం రాలేదు. మొదటిసారి `గేమ్‌ ఆన్‌` అనే మూవీ రాబోతుంది. ఫిబ్రవరి 2న ఇది రిలీజ్ కానుంది. ఇందులో గీతానంద్‌, నేహా సోలంకి జంటగా నటించారు. దయానంద్‌ దర్శకత్వం వహించారు. మధుబాల, ఆదిత్య మీనన్‌, శుభలేఖ సుధాఖర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ప్రీ రిలీజ ఈవెంట్‌ జరిగింది. 

ఇందులో శుభలేఖ సుధాకర్‌ మాట్లాడుతూ, మన జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో గేమ్‌ ఆడుతూనే ఉంటారని, కొన్ని సార్లు గేమ్‌ రివర్స్ అవుతుందని, అలాంటి సమయంలో ఏం చేయాలనేది ఆసక్తికరంగా ఉంటుంది.ఈ సినిమా కూడా అలానే ఉటుందన్నారు. నిర్మాత వివేక్ కూచిభొట్ల మాట్లాడుతూ, ` సినిమా నేను చూశాను. మంచి కాన్సెప్ట్ తో చాలా బాగా తీశారు. ఫస్ట్ టైం డైరెక్టర్ లా ఎక్కడా అనిపించలేదు. ప్యాక్డ్ స్క్రీన్ ప్లే తో రూపొందించారు. హీరో గీతానంద్ పర్ఫామెన్స్   బాగా చేశారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నా" అని అన్నారు. 

మరో గెస్ట్ గా హాజరైన శివ బాలాజీ మాట్లాడుతూ.."నేను ఇండస్ట్రీకి రావడానికి మూల కారణం హీరో, డైరెక్టర్ నాన్న కుమార్ గారే కారణం. వీళ్ళిద్దరినీ నేను చిన్నప్పటినుంచి చూస్తున్నాను. దయానంద్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినట్టు అనిపించలేదు.  ఎంతో అనుభవం ఉన్నవాడిలా ప్రతి విషయాన్ని డీటెయిల్ గా చూపించాడు. గీతానంద్ పేరు వెనుక  కూడా ఒక స్టోరీ ఉంది. గీతా ఆర్ట్స్ సంస్థను చూసి ఆయనకు వాళ్ళ నాన్న ఈ పేరు పెట్టారు. గీత ఆర్ట్స్ ఎంత సక్సెస్ అయిందో గీతానంద్ కూడా సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతాడని నమ్మకం ఉంది. నేహా సోలంకి బాగా నటించింది. టెక్నీషియన్స్ పరంగా కెమెరామెన్, మ్యూజిక్ డైరెక్టర్ అందరూ బెస్ట్ ఇచ్చారు. ఫిబ్రవరి 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్" అని చెప్పారు. 

హీరో గీతానంద్ మాట్లాడుతూ.."ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్. ఇలాంటి కాన్సెప్ట్ ఇప్పటి వరకు తెలుగు సినిమాల్లో రాలేదు. రియల్ టైంలో సాగే  సైకలాజికల్ గేమ్ అందర్నీ ఆకట్టుకుంటుంది. సౌండ్,  ట్విస్టులు,  విజువల్స్ అన్ని చాలా కొత్తగా ఉంటాయి. ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నేను చాలా కష్టాలు పడ్డాను. బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కంటెంట్ ఉన్న సినిమాలు తీయాలనుకున్నా. థియేటర్లో సినిమా చూసిన ప్రేక్షకులు ఇతర దమ్మున్న సినిమా అనుకునేలా దీన్ని రూపొందించాం. అలాంటి పవర్ ప్యాక్డ్ మూవీ ఇది. నిర్మాత రవి నాకు  క్లోజ్ ఫ్రెండ్. చాలా క్వాలిటీగా ఈ చిత్రాన్ని నిర్మించాడు. మా తమ్ముడు దయానంద్ ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశాడు. ప్రతి క్రాఫ్ట్ నెక్స్ట్ లెవెల్ లో అవుట్ పుట్ ఇచ్చారు. థియేటర్స్ లో ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది" అని చెప్పారు. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్షన్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి ఈ మూవీని నిర్మించారు.  dd
 

Follow Us:
Download App:
  • android
  • ios