Asianet News TeluguAsianet News Telugu

`ఆదికేశవ` నుంచి మొదటి సాంగ్‌ వచ్చింది.. `సిత్తరాల సిత్రావతి`పాటకి శ్రీలీల కిర్రాక్‌ డాన్సు..

వైష్ణవ్‌ తేజ హీరోగా, యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల కథానాయికగా నటించిన `ఆదికేశవ` మూవీ నుంచి మొదటి పాట విడుదలైంది. హీరోయిన్‌ని ఉద్దేశించి హీరో పాడే పాట అదరగొడుతుంది. 

first song out from aadikeshava movie sreeleela kirrack dance arj
Author
First Published Sep 9, 2023, 1:54 PM IST

`ఉప్పెన` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్‌ తేజ్‌కి మళ్లీ సక్సెస్‌ పడలేదు. బ్యాక్ టూ బ్యాక్‌ రెండు చిత్రాలు పరాజయం చెందాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నారు. `ఆదికేశవ` అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో యంగ్‌ సెన్సేషన్‌ శ్రీలీల కథానాయికగా నటిస్తుండటం విశేషం. మలయాళ నటులు అపర్ణ దాస్‌, జోజు జార్జ్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండటంతో ఈ చిత్రంపై ఆసక్తి ఏర్పడింది. ఈ చిత్రంతో శ్రీకాంత్‌ ఎన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 

ఈ సినిమాకి జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్‌ కుమార్‌ సంగీతం అందిస్తున్నారు. సినిమా మరో రెండు నెలల్లో విడుదల కాబోతుంది. ఇప్పట్నుంచే ప్రమోషన్స్ కార్యక్రమాల జోరు పెంచారు. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా నుంచి తొలి పాటని విడుదల చేశారు. `సిత్తరాల సిత్రావతి` అంటూ సాగే మెలోడీ సాంగ్‌ని శనివారం విడుదల చేశారు. ఈ పాటకి జీవి ప్రకాష్‌ సంగీతం అందించారు.

పాటల రచయిత  రామజోగయ్య శాస్త్రి, అందమైన పదాల అమరికతో పాటకు ప్రాణం పోశారు. ఆస్కార్ అవార్డ్ గెలిచిన 'నాటు నాటు' పాట గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఈ పాటకి తన గాత్రంతో విభిన్నమైన జానపద రుచిని అందించారు. గాయని రమ్య బెహరా పాటలోని అనుభూతిని తన స్వరంలో చక్కగా పలికించారు. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ఈ మెలోడీ సాంగ్‌ శ్రోతలను ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈ పాటలో హీరో వైష్ణవ్ తేజ్ తన చిత్ర(కథానాయిక శ్రీలీల)ను 'సిత్తరాల సిత్రావతి' అని పిలుస్తూ, ఆమె అందాన్ని పొగుడుతూ పాడే గీతంగా కనిపిస్తుంది. ప్రస్తుతం పాట ట్రెండ్‌ అవుతుంది.

ఇక `ఆదికేశవ` సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య  నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. `థియేటర్లలో ప్రేక్షకులకు మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని అందించడానికి తాము కసరత్తులు చేస్తున్నామని, ఈ చిత్రం పట్ల ఎంతో సంతృప్తిగా ఉన్నట్టు నిర్మాతలు తెలిపారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాని దీపావళి కానుకగా నవంబర్‌ 10న విడుదల చేస్తున్నామని, ఈ దీపావళికి బాక్సాఫీస్ దగ్గర విజయ ఢంకా మోగిస్తామని నిర్మాతలు తెలిపారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి డడ్లీ, ఆర్థర్ ఎ. విల్సన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.  ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios