సాగర కన్య శిల్పా శెట్టి తన స్లిమ్‌ అందాలతో మెస్మరైజ్‌ చేస్తుంటుంది. ఆమె ముంబయికి చెందిన వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాని వివాహం చేసుకున్నాక సినిమాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టింది. మధ్య మధ్యలో ఐటెమ్‌ సాంగ్‌ల్లో మెరిసిందీ భామ.

శిల్పా, రాజ్‌ కుంద్రాలకు 2012లో కుమారుడు వియాన్‌ రాజ్‌ కుంద్ర జన్మించాడు. ఇక వీరు సరోగసి ద్వారా ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండో బిడ్డకి జన్మనిచ్చారు. ఫిబ్రవరి 15న కూతురు సమీషా జన్మించింది. అయితే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తన కూతురుని అభిమానులకు పరిచయం చేయలేదు శిల్పా. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పలు వీడియోలను పంచుకున్నా, అందులో కనిపించకుండా మ్యానేజ్‌ చేశారు. 

అయితే ఇప్పుడు ఫోటోలకు దొరికిపోయింది. తన ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఫోటోలకు చిక్కింది. తన ముద్దుల తనయని క్లిక్‌మనిపించారు ఫోటోగ్రాఫర్లు. ఇందులో సమీషా చాలా బొద్దుగా ఎంతో క్యూట్‌గా ఉంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. 

శిల్పా దాదాపు 13ఏళ్ళ తర్వాత నటిగా రీఎంట్రి ఇస్తుంది. ప్రస్తుతం `నికమ్మా`, `హంగామా 2` చిత్రాల్లో నటిస్తుంది. ఇవి వచ్చే ఏడాది ఆడియెన్స్ ముందుకు రానున్నాయి.