రంజాన్ సందర్భంగా శనివారం నాడు బిగ్ బాస్ ఎపిసోడ్ 7 లోకి ఎంట్రీ ఇచ్చాడు నాని. గత వారం రోజులుగా ఈ షోకి వస్తోన్న రెస్పాన్స్ ను ఆడియన్స్ కు తెలియజేశారు. దీప్తి సునైనా, అమిత్ తివారిల కోసం సోషల్ మీడియాలో ఏర్పడ్డ అభిమాన సంఘాలు, వారిపై వేస్తోన్న జోక్స్, మీమ్స్ గురించి చర్చించారు. 

ఇక ఈరోజు ఎలిమినేషన్ రౌండ్ ఉండడంతో ఈ షో నుండి వెళ్ళిపోయే ఆ కంటెస్టంట్ ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగిపోతుంది. రంజాన్ సందర్భంగా.. బిగ్ బాస్ పోటీదారులు అందరికీ హలీం పంపించడంతో వారంతా ఆనందంలో మునిగిపోయారు.