Asianet News TeluguAsianet News Telugu

సౌత్ లో మనోళ్లే బాక్స్ ఆఫీస్ కింగ్స్..!

టాలీవుడ్ బిజినెస్ రోజు రోజుకి విస్తరిస్తోందని బాక్స్ ఆఫీస్ నెంబర్స్ ని చూస్తుంటే చాలా క్లారిటీగా అర్ధమవుతోంది. మొన్నటి వరకు సౌత్ లో కోలీవుడ్ సినిమాలదే హావా ఉండేది. కానీ మన స్టార్ హీరోలు కూడా సౌత్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు లెక్కలు మారుస్తున్నారు. 

first day south highest gross collection movies
Author
Hyderabad, First Published Oct 13, 2018, 2:51 PM IST

టాలీవుడ్ బిజినెస్ రోజు రోజుకి విస్తరిస్తోందని బాక్స్ ఆఫీస్ నెంబర్స్ ని చూస్తుంటే చాలా క్లారిటీగా అర్ధమవుతోంది. మొన్నటి వరకు సౌత్ లో కోలీవుడ్ సినిమాలదే హావా ఉండేది. కానీ మన స్టార్ హీరోలు కూడా సౌత్ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు లెక్కలు మారుస్తున్నారు. రజినీకాంత్ - విజయ్ లాంటి స్టార్ హీరోలు సైతం ఇప్పుడు మన హీరోలతో సమానమే. 

ఎందుకంటే రజినీకాంత్ లాంటి హీరో సినిమాలు అనువాదమయ్యి ఆ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటే మన హీరోలు కేవలం ఒక్క బాషలోనే వారితో సమానంగా పోటీపడుతున్నారు. అరవింద సమేత మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ ను పరిశీలిస్తే 58 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. ఈ రికార్డ్ లో నుంచి బాహుబలి 2ని మినహాయిస్తే సౌత్ లో  కబాలి 87.5కోట్ల గ్రాస్ తో (తెలుగు - తమిళ్ - హిందీ ) మొదటి స్థానంలో ఉంది. 

ఆ తరువాత స్థానంలో బాహుబలి ఫస్ట్ పార్ట్ 73కోట్లతో ఉంది. ఇక పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి 60.5కోట్లతో టాప్ 5 లో ఉండటం విశేషం. ఆ సినిమాకు కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ ఏ స్థాయిలో వచ్చి ఉండేవో అర్ధం చేసుకోవచ్చు. ఇక తారక్ - ఎన్టీఆర్ కాంబినేషన్ మొదటిసారి కలవడంతో అరవింద సమేతకు మొదటి రోజు 58 కోట్ల గ్రాస్ వచ్చింది. ఇక సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడంతో ముందు ముందు మరిన్ని కలెక్షన్స్ దక్కే అవకాశం ఉంది. హాలిడేస్ కూడా అరవింద సమేతకు మంచి బూస్ట్ అని చెప్పవచ్చు. 

సౌత్ లో మొదటి రోజు వరల్డ్ వైడ్ గా అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న టాప్  సినిమాలు. 

బాహుబలి 2 (తెలుగు - హిందీ - తమిళ్ - మలయాళం) - 214కోట్లు 

కబాలి (తమిళ్ - హిందీ - తెలుగు) - 87.5కోట్లు 

బాహుబలి 1 (తెలుగు-తమిళ్-హిందీ-మలయాళం) -73కోట్లు 

అజ్ఞాతవాసి  (నో డబ్ రిలీజ్)   - 60కోట్లు 

అరవింద సమేత (నో డబ్ రిలీజ్)   - 58కోట్లు 

భరత్ అనే నేను  (నో డబ్ రిలీజ్)    - 53.8కోట్లు   

ఖైదీ నెం.150 (రీమేక్) - 50.45 కోట్లు  

మెర్సల్ (నో డబ్ రిలీజ్) - 47.1కోట్లు

జై లవ కుశ (నో డబ్ రిలీజ్) - 46.6కోట్లు 

రంగస్థలం (నో డబ్ రిలీజ్) - 43.8కోట్లు 

Follow Us:
Download App:
  • android
  • ios