ఆర్జీవీకి ‘వ్యూహం’ సినిమా ఈవెంట్ తర్వాత పెద్ద షాక్ తగిలింది. పలువురు టీడీపీ కార్యకర్తలు ఆయన ఆఫీసు ముందు నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోను రామ్ గోపాల్ వర్మనే స్వయంగా షేర్ చేశారు. 

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ Ram Gopal Varma ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గ్గానే ఉంటారు. తను చేసే సినిమాలు, కామెంట్లు, పొలిటికల్ సెటైర్ల పరంగా ఆర్జీవీ పేరు నెట్టింట ట్రెండ్ దర్శనమిస్తూనే ఉంటుంది. ఇక ప్రస్తుతం పొలిటికల్ సెటైరికల్ మూవీ ‘వ్యూహం’ Vyoohamతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. నిన్న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు. 

ఈవెంట్ ఆర్జీవీ చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. మరోవైపు రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసిన పోస్టర్లలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) , నారా లోకేష్ (Nara Lokesh), జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను బర్రెలతో పోల్చడం వివాదాస్పదంగా మారింది. ఆర్జీవీ వ్యాఖ్యలు టీడీపీ కార్యకర్తలు, పవన్ అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆయన తీరు మార్చుకోవాలని హెచ్చరిస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా ఆ మూవీని రిలీజ్ చేయొద్దంటూ.. సినిమాలోని పాత్రలు చూపించిన తీరు సరిగా లేదంటూ నిరసన వ్యక్తం చేశారు. ఏకంగా ఆర్జీవీ వ్యూహం ఆఫీస్ ఎదుట రామ్ గోపాల్ వర్మ దిష్టిబొమ్మను దహనం చేశారు. వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే తన ఇంటి ముందు మంటపెట్టిన దృశ్యాన్ని ఆర్జీవీ వీడియో తీసి ట్విటర్ పోస్ట్ చేయడం మరింత చర్చగా మారింది. 

పైగా ఆ వీడియోను చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కు ట్యాగ్ చేశారు. ’మీ కుక్కలు నా ఇంటి ముందు మొరుగుతున్నాయి. పోలీసులు వచ్చే లోపు పారిపోయాయి’. అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం వారిపై వర్మ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈనెల 29న థియేటర్లలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది. మూవీ రిలీజ్ తర్వాత ఇంకెలాంటి అల్లర్లు జరుగుతాయోననేది సందేహంగా మారింది. 

Scroll to load tweet…