ఆల్రెడీ సినిమా షూటింగ్ పూర్తై గుమ్మడికాయ కూడా కొట్టేసిన తరువాత ఇప్పుడు సినిమా క్లైమాక్స్ లో మార్పులు చేయడానికి సిద్ధపడుతున్నారు 'మహర్షి' మూవీ మేకర్స్. మహేష్ బాబు హీరోగా దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.

దిల్ రాజు, పీవీపీ, అశ్వనీదత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవల రామోజీ ఫిలిం సిటీలో జరిగిన మేజర్ షెడ్యూల్ తో సినిమా షూటింగ్ పూర్తయింది. మే 9న సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.

అయితే ఇటీవల సినిమా క్లైమాక్స్ చూసిన మహేష్, దిల్ రాజులకు పతాక సన్నివేశాలు ఆశించిన స్థాయిలో లేవని అభిప్రాయపడ్డారట. క్లైమాక్స్ లు రైతుల కోసం చెప్పే డైలాగులు, సొసైటీ కి ఇచ్చే మెసేజ్ డోస్ కాస్త ఎక్కువైందని, జనాలు క్లాస్ పీకుతున్నట్లుగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉందని భావించి ఇప్పుడు ఆ సన్నివేశాలను సరిచేసే పనిలో పడ్డారు.

వచ్చే వారం మరోసారి రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి క్లైమాక్స్ పోర్షన్ రీషూట్ చేయాలని భావిస్తున్నారు. ఆ విధంగా మంచి అవుట్ పుట్ వస్తుందని నమ్ముతున్నారు. సో.. 'మహర్షి' కోసం కొత్త క్లైమాక్స్ రెడీ అవుతోందన్నమాట. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.