Salaar: మౌనం వీడిన సలార్ టీం... విడుదల తేదీపై షాకింగ్ అప్డేట్!
ప్రభాస్ లేటెస్ట్ మూవీ సలార్ విడుదల వాయిదా అంటూ కొద్దిరోజులుగా వినిపిస్తుంది. నేడు దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది.

సలార్ (Salaar)మూవీపై వరల్డ్ వైడ్ అంచనాలున్నాయి. కాంబినేషన్ ఈ చిత్రానికి భారీ క్రేజ్ తెచ్చింది. కెజిఎఫ్ దర్శకుడు బాహుబలి హీరో చేస్తున్న మూవీ కావడంతో పెద్ద ఎత్తున హైప్ తెచ్చుకుంది. సెప్టెంబర్ 28న సలార్ వరల్డ్ వైడ్ విడుదల కావాల్సి ఉంది. యూఎస్ లో బుకింగ్స్ కూడా మొదలెట్టారు. రిలీజ్ కి నెలరోజుల ముందే హాట్ కేకుల్లా సలార్ టికెట్స్ అమ్మడుపోయాయి. ఇక రికార్డ్స్ బద్దలే అని ఫ్యాన్స్ సంబరపడుతున్న వేళ విడుదల వాయిదా అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి.
సలార్ నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్ కి దీనిపై క్లారిటీ ఇచ్చారంటూ సోషల్ మీడియాలో టాక్ వినిపించింది. దీన్ని బలపరుస్తూ యూఎస్ లో సలార్ బుకింగ్స్ ఆపేశారు. దాంతో ఫ్యాన్స్ ఓ అభిప్రాయానికి వచ్చారు. అయితే సలార్ నిర్మాతలు అధికారిక ప్రకటన చేయలేదు. ఎట్టకేలకు మౌనం వీడిన సలార్ యూనిట్ మూవీ సెప్టెంబర్ 28న రావడం లేదంటూ ప్రకటన చేశారు.
సలార్ అనుకున్న సమయానికి విడుదల చేయలేక పోతున్నందుకు చింతిస్తున్నాము. మీ ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. తర్వలో కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని చావు కబురు చల్లగా చెప్పారు. ఇది షాకింగ్ న్యూస్ కాకున్నప్పటికీ... ఎక్కడో ఓ మూలన ఉన్న హోప్స్ కూడా పోయాయి. లాంగ్ వీకెండ్ తో పాటు సెలవు దినాలు కలిసొచ్చిన గోల్డెన్ట్ డేట్ ని సలార్ మిస్ చేసుకుంది. ఈ పరిణామాన్ని టాలీవుడ్ ఇతర చిత్రాలు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
సలార్ నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదల అంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చిత్ర యూనిట్ మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కేవలం విడుదల పోస్ట్ ఫోన్ అని చెప్పారు. ప్రభాస్(prabhas) కి జంటగా శృతి హాసన్ నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు. కెజిఎఫ్ నిర్మాతలైన హోంబలే పిక్చర్స్ నిర్మిస్తున్నారు.