ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఇది నా ఫేవరేట్ ఎపిసోడ్ అంటూ షాకింగ్ విషయం బయటపెట్టారు రామ్ చరణ్. దీనికి సంబంధించిన ఆయన ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది.
దర్శకుడు రాజమౌళి (Rajamouli) విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ రికార్డుల మోతమోగిస్తుంది. తెలుగు స్టేట్స్ లో ఆర్ ఆర్ ఆర్ బాహుబలి 2 రికార్డ్స్ తుడిచి పెట్టింది. ఆర్ ఆర్ ఆర్ హీరోలు చరణ్, ఎన్టీఆర్ తన అద్భుత నటనతో ఫ్యాన్స్ కి మరపురాని అనుభూతిని పంచారు. ఈ క్రమంలో రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ షూట్ లో తనకు అత్యంత ఫేవరేట్ ఎపిసోడ్స్ లో ఒక దానికి సంబంధించిన స్టిల్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. రాజమౌళి సీన్ వివరిస్తున్న ఆ ఫొటోలో చరణ్ సీరియస్ గా వింటున్నారు. ఇంతకీ రామ్ చరణ్ కి అంతగా నచ్చిన ఆ ఎపిసోడ్.. తన ఇంట్రో సీన్.
ఆర్ ఆర్ ఆర్ లో అద్భుతమైన ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ (Ram Charan) ఇంట్రో ఒకటి. వేల మంది నిరసనకారుల మధ్యలో ఉన్న ఓ నేరస్తుడి అధికారి ఆదేశం మేరకు తీసుకొచ్చే ఆ సన్నివేశంలో రామ్ చరణ్ నటన అద్భుతం. సదరు యాక్షన్ ఎపిసోడ్ లో రామ్ చరణ్ నటన చాలా సహజంగా సాగింది. అదే సమయంలో గూస్ బంప్స్ కలిగించేదిగా ఉంది. ఆ ఎపిసోడ్ చిత్రీకరణకు సంబంధించిన స్టిల్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన రామ్ చరణ్... తన ఫేవరేట్ ఎపిసోడ్ అంటూ కామెంట్ చేశారు.
ఇక ఆర్ ఆర్ ఆర్ విడుదలై రెండు వారాలు కావస్తుంది. ఈ భారీ చిత్రం వరల్డ్ వైడ్ వసూళ్లు రూ. 1000 కోట్ల దిశగా వెళుతున్నాయి. కాగా నైజాంలో రూ. 100 కోట్ల షేర్ రాబట్టి ఆల్ టైం రికార్డు నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఆర్ ఆర్ ఆర్ షేర్ రెండు వందల కోట్లకు చేరువైంది. యూఎస్ లో ఆర్ ఆర్ ఆర్ భారీ వసూళ్లు రాబడుతుంది. $ 12 మిలియన్స్ క్రాస్ చేసిన ఆర్ ఆర్ ఆర్ వసూళ్లు అక్కడ స్థిరంగా సాగుతున్నాయి. ఇక హిందీలో రూ. 200 కోట్ల గ్రాస్ వసూళ్లకు చేరువైంది.
హిందీలో మాత్రం బాహుబలి 2 రికార్డు ఆర్ ఆర్ ఆర్ టచ్ చేయలేకపోయింది. బాహుబలి హిందీ వర్షన్ రూ. 500 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన విషయం తెలిసిందే. ఇక వరల్డ్ వైడ్ గా అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ చిత్రాల జాబితాలో ఆర్ ఆర్ ఆర్ చేరింది. రాజమౌళి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కించారు. ఎన్టీఆర్ (NTR) కొమురం భీమ్, చరణ్ అల్లూరి పాత్రలు చేశారు. నిర్మాత డివివి దానయ్య రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.
