Asianet News TeluguAsianet News Telugu

పూరి నెక్ట్స్ ప్రాజక్టుకు స్టార్ దొరికాడు... ఓకే చెప్పారు

పూరి కు ఉన్నంత హిట్ ట్రాక్ లిస్ట్ మరే డైరక్టర్ కు లేకపోయినా లైగర్ నే గుర్తు చేసుకుని దూరం పెడుతున్నారు.కానీ పూరి పట్టువదలని విక్రమార్కుడులా ముందుకు వెళ్తున్నారు.  

Finally Puri Jagannadh  Convinced A star hero for his next
Author
First Published Dec 7, 2022, 3:42 PM IST


ఎన్నో ఎక్సపెక్టేషన్స్ మధ్య రిలీజ్ అయిన లైగర్ (Liger) చిత్రం డిజాస్టర్ కావడంతో డేరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్‌  కు  కష్టాలు మొదలు అయ్యాయి.  ఆయనతో సినిమా అంటే హీరోలు మొహం చాటేస్తున్నారు. పూరి కు ఉన్నంత హిట్ ట్రాక్ లిస్ట్ మరే డైరక్టర్ కు లేకపోయినా లైగర్ నే గుర్తు చేసుకుని దూరం పెడుతున్నారు.కానీ పూరి పట్టువదలని విక్రమార్కుడులా ముందుకు వెళ్తున్నారు.  ఫైనల్ గా ఓ స్టార్ ని ఒప్పించినట్లు సమాచారం. ఆ స్టార్ మరెవరో కాదు...

తెలుగులో ఒకప్పుడు వరుస హిట్స్‌తో క్రేజీ డైరెక్టర్‌గా మారిన పూరి.. మధ్యలో కొంతమంది మోసం చేయడంతో సంపాదించి అంతా పొగొట్టుకున్నాడు. మళ్లీ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పూరి.. కెరీర్‌లో మళ్లీ పుంజుకున్నాడు. ఈ సినిమాతో తనలో ఇంకా వాడి తగ్గలేదని నిరూపించుకున్నాడు. అదే ఊపుతో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా లెవల్లో లైగర్ సినిమాను తెరకెక్కించాడు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో పూరి మళ్లీ కష్టాలు మొదలయ్యాయని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.  ఈ నేపధ్యంలో పూరి ...ఓ స్టార్ తో సినిమా చేయించాడనేది అదిరిపోయే వార్తే. ఆ హీరో మెగాస్టార్ చిరంజీవి అని సమాచారం.

పూరి జగన్నాథ్ చెప్పిన స్క్రిప్టుకు ఇమ్మీడియట్ గా ఓకే చెప్పిన చిరంజీవి...గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అవుట్ అండ్ అవుడ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరెకెక్కనుంది. త్వరలోనే బౌండెడ్ స్క్రిప్టుతో మరో నేరేషన్ ఇవ్వనున్నారు పూరి.  పూరి మార్క్ క్యారక్టరైజేషన్ తో ఈ సినిమా సాగనుంది. పూరి పూర్తిగా క్రియేటివ్ ఫ్రీడమ్ ఇచ్చారని తెలుస్తోంది. లైగర్ అంత పెద్ద డిజాస్టర్ అయినా చిరంజీవి నమ్మి ఆఫర్ ఇవ్వడం ఆనందపరిచే అంశం. చిరుతో సినిమా అంటే ఖచ్చితంగా పూరి కు మరో బ్రేక్ వస్తుందని నమ్ముతున్నారు.  

గాడ్ ఫాదర్ లో పూరి జగన్నాథ్ ని చిన్న పాత్ర కోసం చిరంజీవి స్వయంగా పిలిచి అడగటం, వెంటనే పూరి ఓకే చెప్పటం ప్లస్ అయ్యిందంటున్నారు. అలాగే చిరంజీవి..పూరిని తన చిత్రం ప్రమోషన్స్ లో ఇంటర్వూ చేయటం బాగా హెల్ప్ చేసిందంటున్నారు. గతంలో రామ్ చరణ్ ని పూరి జగన్నాథ్ ..చిరుత చిత్రలో లాంచ్ చేసి పెద్ద హిట్ ఇచ్చారు. ఆ తర్వాత చిరంజీవి, పూరి కాంబోలో ఆటో జాని అనుకున్నారు కానీ ఆ సినిమా మొదలే కాలేదు.
  

Follow Us:
Download App:
  • android
  • ios