నిహారిక కొణిదెలకు పెళ్లికళ వచ్చేసింది. మరో వారం రోజుల్లో మెగా కుటుంబంలో పెళ్లి భాజా మోగనుంది.  నిహారిక, జొన్నలగడ్డ చైతన్యల వివాహానికి పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రిక కూడా సిద్ధం చేశారు. డిసెంబర్ 9వ తేదీన రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్ పూర్ నందు గల ఉదయ్ పూర్ ప్యాలెస్ లో నిహారిక, చైతన్యుల వివాహం జరగనుంది. వివాహం అనంతరం డిసెంబర్ 11వ తేదీన హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోని జేఆర్సి కన్వెన్షన్ హాలులో ఈ వేడుక జరగనుంది. 

రాజస్థాన్ లో గ్రాండ్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుండగా కేవలం సన్నిహితులు,బంధువులు మాత్రమే హాజరుకానున్నారు. వివాహానికి హాజరుకాని వారి కోసం హైదరాబాదులో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇక నిహారిక వెడ్డింగ్ కార్డు చాలా గ్రాండ్ గా ఉంది. రాజుల కాలం నాటి సంస్కృతి తలపించేలా, ఏనుగులు, రాజ ప్రసాదాల డిజైన్ కలిగిన వెడ్డింగ్ కార్డు, లాక్ తో కూడిన ప్రత్యేకమైన బాక్స్ తో ఏర్పాటు చేశారు. బాక్స్ లో వెడ్డింగ్ కార్డుతో పాటు ఖరీదైన స్వీట్స్ కూడా ఉంచడం జరిగింది. 

వెడ్డింగ్ కార్ట్ నే ఇంత గ్రాండ్ గా చేయించిన కుటుంబ సభ్యులు, పెళ్లి ఎంత వైభవంగా చేయనున్నారో అనే అంచనాలు అందరిలో మొదలైపోయాయి. మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ లతో పాటు మెగా హీరోలు చరణ్, బన్నీ, సాయి ధరమ్ ఈ పెళ్ళికి హాజరై సందడి చేయనున్నారు. టాలీవుడ్ లో అతిపెద్ద ఫ్యామిలీలో జరగనున్న ఈ వేడుక టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ కావడం ఖాయంగా కనిపిస్తుంది.