టికెట్‌ టూ ఫినాలే అత్యధిక మార్కులు వచ్చిన ఆదిరెడ్డి, రేవంత్‌, శ్రీహాన్‌ ల మధ్య ట్రయా తలాన్‌ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో రేవంత్‌ మొదటి స్థానంలో, శ్రీహాన్‌ రెండో స్థానంలో, ఆదిరెడ్డి మూడో స్థానంలో నిలిచారు.

బిగ్‌ బాస్‌ 6 తెలుగు షో చివరి దశకు చేరుకుంది. మరో రెండు వారాల్లో షో కంప్లీట్‌ కాబోతుంది. 13వ వారం ముగింపు చేరుకుంది. శుక్రవారం ఎపిసోడ్‌లో హైడ్రామా నడుము సాగింది. `టికెట్‌ టూ ఫినాలే` టాస్క్ లతోనే సాగింది. ఏకాభిప్రాయాలు, ఫైనల్ గా పోటీ పడేందుకు సభ్యుల మధ్య చర్చోపచర్చలు జరిగాయి. మొదటి రౌండ్‌లో శ్రీ సత్య, ఇనయ ఛాన్స్ కోల్పోగా, కీర్తి కూడా ఎలిమినేట్‌ అయ్యారు. ఇక రేవంత్‌, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, రోహిత్‌, ఫైమాల మధ్య టికెట్ టూ ఫినాలే టాస్క్ జరిగింది. 

అయితే ఫైనల్‌ రౌండ్‌ కోసం ఇచ్చిన టాస్క్ లు, ఏకాభిప్రాయాల కారణంగా రోహిత్‌, ఫైమా తప్పుకున్నారు. ఆదిరెడ్డి కోసం ఇంటి సభ్యుల మధ్య గట్టి వాగ్వాదమే జరిగింది. ఈ క్రమంలో హౌజ్‌ మేల్స్ ఓ టీమ్‌, ఫీమేల్‌ మరో టీమ్లా ఏర్పడింది. ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటూ రెచ్చిపోయారు. ఇనయ నిర్ణయంపై రోహిత్‌ మండిపడ్డాడు. అన్‌ పెయిర్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నారని, సిల్లీగా ఉందన్నారు. 

అయితే టికెట్‌ టూ ఫినాలే అత్యధిక మార్కులు వచ్చిన ఆదిరెడ్డి, రేవంత్‌, శ్రీహాన్‌ ల మధ్య ట్రయా తలాన్‌ అనే టాస్క్ ఇచ్చారు. ఇందులో రేవంత్‌ మొదటి స్థానంలో, శ్రీహాన్‌ రెండో స్థానంలో, ఆదిరెడ్డి మూడో స్థానంలో నిలిచారు. అయితే రేవంత్‌ మార్కుల పరంగా మొదటి స్థానానికి చేరుకున్నారు. శ్రీహాన్‌, ఆదిరెడ్డి టై అయ్యారు. వీరిద్దరి మధ్య మరో టాస్క్ పెట్టగా ఆదిరెడ్డి వెనకబడి పోయారు. దీంతో శ్రీహాన్‌ గెలిచారు. దీంతో రేవంత్‌, శ్రీహాన్‌ `టికెట్‌ టూ ఫినాలే` కోసం పోటీ పడబోతున్నారు. 

ఇప్పుడు ఫైనల్‌ కోసం రేవంత్‌, శ్రీహాన్‌ మధ్య పోరు నెలకొనబోతుంది. హౌజ్‌లో స్నేహితులుగా ఉన్న రేవంత్‌, శ్రీహాన్‌ పోటీ పడబోతుండటం ఆసక్తికరంగా ఉంది. మరి వీరిల్లో విన్నర్‌ ఎవరు? ముందుగా ఫైనల్‌కి ఎవరు చేరతారు అనేది తెలియాల్సి ఉంది. రేపటి(శనివారం) ఎపిసోడ్‌లో దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ టాస్క్ లు పక్కన పెడితే హౌజ్‌లో అబ్బాయిలు, అమ్మాయిల మధ్య టాస్క్ డిస్కషన్‌ రసవత్తరంగా సాగుతుంది. షోకి కావాల్సిన కంటెంట్‌ ఇస్తున్నారు. అలాగే చివర్లో నైట్‌ సమయంలో శ్రీ సత్యతో శ్రీహాన్‌ పులిహోర కలిపే ప్రయత్నం బెడిసి కొట్టినట్టుంది. మరోవైపు బిగ్‌ బాస్‌ 6 తెలుగు 13 వారంలో రేవంత్‌, ఆదిరెడ్డి,కీర్తి, ఫైమా, రోహిత్‌ , శ్రీసత్య నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి.