Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య-బోయపాటి సమ్మర్ కి ఫిక్స్ అయ్యారు... డేట్ ఎప్పుడంటే!

దర్శకుడు బోయపాటి బాలయ్యతో చేస్తున్న హ్యాట్రిక్ మూవీ కాగా, పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్, సింహా రికార్డు కలెక్షన్స్ సాధించడంతో పాటు, బాలయ్య కెరీర్ లోనే భారీ హిట్స్ గా నిలిచాయి. విజయాల పరంగా వెనుకబడ్డ బాలకృష్ణ ఈ చిత్రం విజయంపై చాలా ఆశలు పెట్టుకున్నారు.

finally balakrishna announces release of bb3 ksr
Author
Hyderabad, First Published Jan 31, 2021, 4:31 PM IST

నటసింహం బాలయ్య తన లేటెస్ట్ మూవీ విడుదల తేదీపై అప్డేట్ ఇచ్చారు. సమ్మర్ బరిలో తాము దిగుతున్నట్లు తెలియజేశారు. మే 28న బాలయ్య-బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరక్కుతున్న చిత్రం విడుదల కానుంది.  రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో బాలకృష్ణ లుక్ కేకగా ఉంది. వైట్ షర్ట్, లైట్ పింక్ ఫాంట్స్ లో బాలయ్య అదరగొట్టారు. బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ విడుదల తేదీ ప్రకటించడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 

దర్శకుడు బోయపాటి బాలయ్యతో చేస్తున్న హ్యాట్రిక్ మూవీ కాగా, పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్, సింహా రికార్డు కలెక్షన్స్ సాధించడంతో పాటు, బాలయ్య కెరీర్ లోనే భారీ హిట్స్ గా నిలిచాయి. విజయాల పరంగా వెనుకబడ్డ బాలకృష్ణ ఈ చిత్రం విజయంపై చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ మూవీతో విజయాన్ని అందుకొని హిట్ ట్రాక్ ఎక్కాలని ఆయన చూస్తున్నారు. 

ఈ మూవీలో బాలయ్య ఓ పాత్రలో అఘోరాగా కనిపిస్తారని సమాచారం. ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి స్వయంగా ధ్రువీకరించడం జరిగింది. ఇక బాలకృష్ణకు జంటగా ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. మే 28న రవితేజ ఖిలాడీ సైతం విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బాలయ్య, రవితేజ మధ్య బాక్సాఫీస్ వార్ ఖాయంగా కనిపిస్తుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios