అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14 నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి హీరోయిన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

కియారా అద్వానీ పేరు వినిపిస్తున్నప్పటికీ ఎంతవరకు నిజమనే విషయంలో క్లారిటీ లేదు. సాధారణంగా తన సినిమాలకు సంబంధించి హీరోయిన్ల విషయంలో ఫైనల్ డెసిషన్ బన్నీనే తీసుకుంటాడు.

కానీ ఈసారి మాత్రం ఆ నిర్ణయం త్రివిక్రమ్ ఇష్టానికి వదిలేసినట్లు తెలుస్తోంది. తన సినిమాల కాస్టింగ్ విషయంలో త్రివిక్రమ్ చాలా పర్టిక్యులర్ గా ఉంటాడు. సినిమాలో నటించే ప్రతి ఆర్టిస్ట్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడు. అందుకే హీరోయిన్ మేటర్ కూడా త్రివిక్రమ్ ఛాయిస్ తోనే ఉంటుందని తెలుస్తోంది.

ఎవరైనా సరే మీ ఇష్టం అంటూ బన్నీ ఇప్పటికే త్రివిక్రమ్ కి చెప్పేశాడట. ఇప్పటివరకు త్రివిక్రమ్ తో కానీ బన్నీతో కానీ పని చేయని హీరోయిన్ ని ఎంపిక చేసుకుంటారని టాక్. మరికొద్దిరోజుల్లో దీనికి సంబంధించిన అధికార ప్రకటన రానుంది.