Asianet News TeluguAsianet News Telugu

Filmfare Awards -2023: ఉత్తమ నటిగా అలియా భట్... కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి షాక్!

ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక అట్టహాసంగా ముగిసింది. అలియా భట్, రాజ్ కుమార్ రావ్ ఉత్తమ నటులుగా అత్యుత్తమ అవార్డులు సొంతం చేసుకున్నారు 
 

filmfare awards 2023 alia bhatt starer gangubai kathiawadi won maximum ksr
Author
First Published Apr 28, 2023, 8:09 AM IST

ఏప్రిల్ 27 రాత్రి ముంబైలో తారల సందడి నెలకొంది. 68వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. స్టార్ హీరోయిన్స్ ఖరీదైన డిజైనర్ వేర్స్ లో మెరిశారు. బాలీవుడ్ మొత్తం ఫిల్మ్ ఫేర్ అవార్డుల వేడుకలో కొలుదీరారు. ఇక ఈ ఏడాది గంగూబాయి కతియావాడి, బదాదై దో చిత్రాలు సత్తా చాటాయి. ఆర్ ఆర్ ఆర్ హీరోయిన్ అలియా భట్ గంగూబాయి కతియావాడి చిత్రానికి గానూ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ఉత్తమ దర్శకుడు అవార్డు కూడా గంగూబాయి కతియావాడి చిత్రానికి దక్కింది. అత్యధికంగా ఈ చిత్రానికి తొమ్మిది అవార్డులు దక్కాయి.

ఆరు అవార్డులతో బధాయి దో రెండో స్థానంలో నిలిచింది. ఈ చిత్ర హీరో రాజ్ కుమార్ రావ్ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. మరో ఐదు విభాగాల్లో బధాయి దో అవార్డులు గెలుచుకుంది. అనూహ్యంగా కాశ్మీర్ ఫైల్స్ చిత్రానికి ఒక్క అవార్డు కూడా రాలేదు. అత్యధిక విభాగాల్లో నామినేషన్ దక్కించుకున్న ఈ చిత్రానికి తీవ్ర నిరాశ ఎదురైంది. ఫిల్మ్ ఫేర్ 2023 విజేతలను పరిశీలిస్తే... 

ఉత్తమ చిత్రం: గంగూబాయి కతియావాడి
ఉత్తమ దర్శకుడు: సంజయ్‌ లీలా భన్సాలీ (గంగూబాయి కతియావాడి )
ఉత్తమ చిత్రం(క్రిటిక్స్‌): బధాయి దో (హర్షవర్థన్‌ కుల్‌కర్ణి)
ఉత్తమ నటుడు: రాజ్‌కుమార్‌ రావ్‌ (బదాయ్‌ దో)
ఉత్తమ నటుడు(క్రిటిక్స్‌): సంజయ్‌ మిశ్రా (వధ్‌)
ఉత్తమ నటి: అలియా భట్‌ (గంగూబాయి కతియావాడి  )
ఉత్తమ నటి (క్రిటిక్స్‌):టబు (భూల్‌ భులయా2), భూమి పెడ్నేకర్‌ (బదాయ్‌ దో)
ఉత్తమ సహా నటుడు: అనిల్‌ కపూర్‌ (జగ్‌జగ్‌ జీయో)
ఉత్తమ సహాయ నటి: షీబీ చద్దా (బధాయి దో)
ఉత్తమ గీత రచయిత: అమితాబ్‌ భట్టాచార్య (కేసరియా: బ్రహ్మాస్త్ర: శివ)
ఉత్తమ మ్యూజిక్‌ ఆల్బమ్‌: ప్రీతమ్‌ (బ్రహ్మాస్త్ర: శివ)
ఉత్తమ నేపథ్య గాయకుడు: అర్జిత్‌ సింగ్‌ (కేసరియా: బ్రహ్మాస్త్ర: శివ)
ఉత్తమ నేపథ్యగాయని: కవిత సేథ్‌ (రంగిసరి- జగ్‌జగ్‌ జీయో)
ఉత్తమ కథ: అక్షిత్‌ గిల్‌డియల్‌, సుమన్‌ అధికారి(బధాయి దో)
ఉత్తమ స్క్రీన్‌ప్లే: అక్షిత్‌ గిల్‌డియల్‌, సుమన్‌ అధికారి, హర్షవర్థన్‌ కుల్‌కర్ణి(బధాయి దో)
ఉత్తమ సంభాషణలు: ప్రకాశ్‌ కపాడియా, ఉత్కర్షిణి వశిష్ట (గంగూబాయి కతియావాడి  )
ఉత్తమ సినిమాటోగ్రఫీ: సుదీప్‌ ఛటర్జీ (గంగూబాయి కతియావాడి  )
ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: సుబ్రత చక్రవర్తి, అమిత్‌ రాయ్ (గంగూబాయి కతియావాడి  )
ఉత్తమ కాస్ట్యూమ్స్‌: సీతల్‌ ఇక్బాల్‌ శర్మ (గంగూబాయి కాఠియావాడి)
ఉత్తమ సౌండ్‌ డిజైన్‌: బిస్వదీప్‌ దీపక్‌ ఛటర్జీ (బ్రహ్మాస్త్ర: శివ)
ఉత్తమ ఎడిటింగ్‌: నినద్‌ ఖనోల్కర్‌ (ఏన్‌ యాక్షన్‌ హీరో)
ఉత్తమ యాక్షన్‌: పర్వేజ్‌ షేక్‌ (విక్రమ్‌ వేద)
ఉత్తమ వీఎఫ్‌ఎక్స్‌: డెంజ్‌, రెడీఫైన్‌ (బ్రహ్మాస్త్ర పార్ట్‌-1: శివ)
ఉత్తమ కొరియోగ్రఫీ: కృతి మహేశ్‌ (దోలిడియా-గంగూబాయి కతియావాడి  )
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: జస్పాల్‌ సింగ్‌సంధు, రాజీవ్‌ బర్నవాల్‌ (వధ్‌)
ఉత్తమ తొలి చిత్ర నటుడు: అంకుష్‌ గీదమ్‌ (ఝండ్‌)
ఉత్తమ తొలి చిత్ర నటి:ఆండ్రియా కెవిచూసా (అనేక్‌)
జీవిత సాఫల్య పురస్కారం: ప్రేమ్‌ చోప్రా
ఆర్డీ బర్మన్‌ అవార్డు:జన్వీ శ్రీమంకర్‌ (దోలాడియా:గంగూబాయి కతియావాడి  )
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios