విషాదంః ప్రముఖ దర్శక, నిర్మాత సుమిత్ర భవే కన్నుమూత
ప్రముఖ దర్శక, నిర్మాత సుమిత్ర భవే(78) కన్నుమూశారు. ఆమె వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం మరణించారు.
ప్రముఖ దర్శక, నిర్మాత సుమిత్ర భవే(78) కన్నుమూశారు. ఆమె వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె సోమవారం మరణించారు. ఊపిరితిత్తులు ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె పుణెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచారు. మరాఠి చిత్ర పరిశ్రమ ముఖ చిత్రాన్నే మార్చేసిన సుమిత్ర భవే కన్నుమూయడం మరాఠి సినిమాకే కాదు, యావత్ ఇండియన్ సినిమాకి తీరని లోటని సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
సుమిత్ర భవే, రచయిత సునీల్ సుక్తాంకర్‌తో కలిసి అనేక సినిమాలకు పనిచేశారు. తమదైన సినిమాలతో, లఘు చిత్రాలతో, టీవీ సీరియల్స్ తో మరాఠీ ఇండస్ట్రీని కొత్త దారిలో నడిపించారు. వీళ్లిద్దరి కలయికలో దాదాపు 50కి పైగా లఘుచిత్రాలు, నాలుగు టీవీ సీరియళ్లు, 17 సినిమాలు వచ్చాయి. వీటన్నింటికీ సుమిత్ర భవే రచయితగా పని చేసింది. సునీల్ సుక్తాంకర్ నటుడిగా, పాటల రచయితగానూ గుర్తింపు పొందాడు.
సుమిత్ర సినిమాల్లో 90 పైచిలుకు పాటలను స్వయంగా ఈయనే రచించాడు. మరాఠి చిత్ర పరిశ్రమలో వీరిద్దరిని వేరు చేసి చూడలేరు. అంతగా వీరిద్దరు సినిమాలకు పనిచేశారు. సుమిత్ర సినీ ఇండస్ట్రీకి అందించిన సేవలకు గానూ వీరికి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. 2016లో వారు తీసిన కాసవ్ సినిమాకు ప్రతిష్టాత్మక గోల్డెన్ లోటస్ నేషనల్ అవార్డు వచ్చింది. `కాసవ్`, `సంహిత`, `ఆస్తు`, `వెల్‌కమ్ హోమ్`, `వాస్తుపురుష్`, `దహవి ఫా`, `దేవ్‌రాయ్` వంటి సినిమాలు మంచి ఆదరణ పొందాయి. `బాయ్`, `పాని`, `దోఖీ` అనే షార్ట్ ఫిల్మ్ కి, `ఆస్తు`, `కాసవ్`, `దేవ్‌రాయ్` చిత్రాలకు జాతీయ అవార్డులు వరించింది.