Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ చిరంజీవితో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల భేటి

చాలా కాలం తరువాత మీడియా మిత్రులతో ప్రశాంతంగా కూర్చొని మాట్లాడారు మెగాస్టార్ చిరంజీవి. తన గాడ్ ఫాదర్  మూవీ సక్సెస్ ను వారితో కలిసి పంచుకున్న మెగాస్టార్.. పిల్మ్ క్రిటిక్స్ అసోసియోషన్ సభ్యులతో మనసు విప్పి మాట్లాడారు.  

Film Critics Association Team Mets Megastar Chiranjeevi
Author
First Published Oct 12, 2022, 2:32 PM IST

ఆచార్య ఫెయిల్యూర్ తో ఇబ్బంది పడ్డ మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాద‌ర్‌ స‌క్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.  భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజైన ఈ సినిమా తొలి రోజు నుంచి మంచి వ‌సూళ్ల‌తో నిర్మాత‌ల‌కు కాసులు కురిపిస్తోంది.దాంతో మెగాస్టార్ చిరంజీవికి ఎక్కడ లేని జోష్ వచ్చేసింది. తన సంతోషాన్ని అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు చిరు. రీసెంట్ గా సక్సెస్ మీట్ పెట్టిన మెగాస్టార్.. అందరికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. అంతే కాదు మీడియాపై కాస్త చిరుబుర్రులాడారు కూడా. 

ఇక  ఈ నేప‌థ్యంలోనే చిరంజీవిని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యులు ఆయ‌న నివాసంలో క‌లిశారు. గాడ్ ఫాద‌ర్ సూపర్   సక్సెస్ సాధించిన సంద‌ర్భంగా అసోసియేష‌న్ స‌భ్యులు చిరంజీవికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.మెగాస్టార్ ను ప్రత్యేకంగా కలిసిన టీమ్ సభ్యులు.. ఆయనతో చాలా సేపు ముచ్చటించారు. ఇండస్ట్రీ గురించి.. సినిమాల ఓటీటీ లాంటి వాటి గురించి కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. 

ఇక తన ఇంటికి వచ్చిన  అసోసియేష‌న్ స‌భ్యుల‌కు చిరంజీవి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. చాలాకాలం త‌ర్వాత మీడియా మిత్రుల‌ను కలవడం.. వారితో ఇలా  మాట్లాడ‌టం తనకు చాలా  సంతోషంగా ఉందన్నారు  చిరంజీవి . గాడ్ ఫాద‌ర్ సినిమాకు సబంధించిన ఎన్నో విషయాలను వారితో పంచుకన్నారు మెగాస్టార్. ఈ సినిమా  స‌క్సెస్ సాధించ‌డం ప‌ట్ల పొందుతున్న ఆనందాన్ని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌తో శేర్ చేసుకున్నారు. 

 

ఇక మలయాళం లో మోహన్ లాల్ నటించిన లూసీఫర్ మూవీకి  తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈసినిమాను మోహ‌న్ రాజా డైరెక్ట్ చేశారు.   ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 5న తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ అయిన గాడ్ ఫాదర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది.  ఇక ఈ గాడ్ ఫాద‌ర్ సినమాను మెగాస్టార్ తన బ్యానర్  కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, తో పాటుగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా తెర‌కెక్కించారు.

గాడ్‌ఫాద‌ర్‌ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు స్టార్ హీరో  స‌ల్మాన్ ఖాన్, తో పాటు టాలీవుడ్ మాస్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కూడా నటించారు. ఇక విలన్ గా మెగా మూవీలో చాన్స్ కొట్టేశాడు.. స‌త్య‌దేవ్‌, న‌య‌న‌తార, సునీల్ కీల‌క పాత్ర పోషించారు. ఇక ఈ సినిమాకు యంగ్ స్టార్..   థ‌మ‌న్ సంగీతం అందించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios