రూల్స్ అంటే అందరూ పాటించేవి...అందరికి సమానంగా వర్తించేవి. రూల్స్ అతిక్రమణ జరిగితే శిక్షకు గురి చేసేవి. అయితే రూల్స్ ని రూలర్ బాలయ్య బాబు కోసం ఫిల్మ్ ఛాంబర్ అతిక్రమించిందని, ఇదేం పద్దతి అని అంటున్నారు ఫిల్మ్ నగర్ జనం. అయితే కొన్ని తప్పనిసరి పరిస్దితుల్లో రూల్స్ ని ప్రక్కన పెట్టి ..వివేచనతో ముందుకు వెళ్ళాలని, అదే ఫిల్మ్ ఛాంబర్ చేసిందని సినీ పెద్దలు అంటున్నారు. అయితే ఇదేమీ బహిరంగంగా జరుగుతున్న చర్చ కాదు. ఫిల్మ్ సర్కిల్స్ లోనూ, ఫిల్మ్ నగర్ క్లబ్ లోనూ జరిగిన చర్చ. అసలేం జరిగింది..


టాలీవుడ్ సినీ రాజధాని హైదరాబాద్ లో ఉన్న  ఫిలిం నగర్లో తెలుగు సిల్మ్ ఛాంబర్ ఆఫీస్  ఉంది. చర్చలకు, నిర్ణయానలకు, కీలక సమావేశాలకు, వివాదాలు..వాటిపై వచ్చే వాదాలకు ఇది కూడలి. ఈ ఫిలిం ఛాంబర్ రామానాయుడు భవనంలో మొదటి అంతంస్తులో వుంది. అదే అంతస్తులో  సినిమా వాళ్ల అవసర నిమిత్తం ఒక చిన్న ప్రివ్యూ  థియేటర్ కూడా  వుంది. ఈ థియేటర్ లో  రేట్లు చాలా నామినల్ గా ఉంటూంటాయి. అయితే ఫిల్మ్ ఛాంబర్ లో మొదటి నుంచీ ఓ రూల్ పెట్టుకున్నారు. 

 ఎట్టి  పరిస్థితిలోనూ ఈ థియేటర్ ను షూటింగ్ లకు ఇవ్వకూడదని. ఇన్నాళ్లూ అది అమలు జరుగుతూ వచ్చింది.  రామానాయుడు భవనం  క్రింద మాత్రం షూటింగ్ లకు అనుమతి ఇస్తూ వచ్చారు కానీ పై దాకా వెళ్లలేదు. ఆ రూల్ ని అతిక్రమించే సాహసం ఎవరూ చేయలేదు.

 ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ  ఆధ్వర్యంలో ఉన్న ఈ ప్రివ్యూ థియేటర్ లో   షూటింగ్ లు జరగలేదు.  అయితే నిన్న ( ఆదివారం నాడు) ప్రివ్యూ థియేటర్ లో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న “ఎన్టీఆర్ బయోపిక్ ” చిత్రం షూటింగ్ జరిగింది. బాలకృష్ణ స్వయంగా ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు కు లెటర్ రాశి ఫర్మిషన్ అడటంతో ఆయన మాట తీసేయ్యలేక ఫర్మిషన్ ఇచ్చారని తెలిసింది. 

అందుకే తప్పని సరి పరిస్థితుల్లో అయినా రూల్స్ ని ప్రక్కన పెట్టడం తప్పే కదా అని కొందరు ఉత్సాహవంతులు మాట్లాడటం మొదలెట్టారు. అయితే ఎవరికీ ధైర్యంగా ఆ మాట మీడియా ముందుకు వచ్చే అనే పరిస్దితి లేదు. అక్కడక్కడే మాట్లాడుకుంటున్నారు. మరికొంతమంది అయితే మా సినిమా షూటింగ్ కు అడుగుతాం...ఇస్తారో లేదా చూస్తా అంటూ ఛాలెంజ్ లు సైతం చేస్తున్నారు.మొత్తానికి బాలయ్య ఈ విధంగానూ వార్తల్లో వ్యక్తి అయ్యారు.