Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss 6: చంటిని రెచ్చగొట్టిన గీతూ.. గువ్వ పగలగొడతానంటూ ఆదిరెడ్డి వార్నింగ్‌ ..

గేమ్‌ ఆడరాని వాళ్లు కూడా ఇలా నా గురించి మాట్లాడుతుంటే కామెడీగా ఉందని రెచ్చగొట్టేలా మాట్లాడారు జక్కన్న. ఇది విన్న చంటి, రాజశేఖర్‌ ఫైర్‌ అయ్యాడు. 

fight start between geetu and chanti adi reddy shocking comments in bigg boss telugu 6
Author
First Published Sep 29, 2022, 11:41 PM IST

బిగ్‌ బాస్‌ తెలుగు 6లో 25వ రోజు కెప్టెన్సీ టాస్క్ పూర్తయ్యింది. `హోటల్ వర్సెస్ హోటల్` టాస్క్ లో విన్నర్‌గా నిలిచి కెప్టెన్సీ పోటీలో ఉన్న వారి మధ్య మరో టాస్క్ ఇచ్చాడు బిగ్‌ బాస్‌. కెప్టెన్సీ టాస్క్ లో ఉన్న వారి ఫోటోలను గార్డెన్ ఏరియాలో బోర్డ్ లకు పెట్టారు. మధ్యలో టేబుల్‌పై బాక్సింగ్‌ బ్లౌజ్‌ ఉంటుంది. బిగ్‌ బాస్‌ బజర్‌ మోగగానే అందరు పరిగెత్తి ముందుగా ఆ బ్లౌజ్‌ని పట్టుకుంటే వారు.. బోర్డ్ లపై ఉన్నవారిలో ఒకరిని ఎలిమినేట్‌ చేయొచ్చు. 

వారు కెప్టెన్సీకి అర్హుల కాకుండా పోతారు. అయితే తగిన కారణంగా ఆ ఫోటోని బ్రేక్‌ చేయాల్సి ఉంటుంది. మొదట రేవంత్‌ బ్లౌజ్‌ అందుకుని రాజ్‌ ఫోటోని బ్రేక్‌ చేశాడు. ఆ తర్వాత సూర్య దాన్ని సాధించి వసంతి ఫోటోని బ్రేక్‌ చేశాడు. ఆది రెడ్డి సాధించి అర్జున్‌ని బ్రేక్‌ చేశాడు. బాలాదిత.. ఫైమాని, చంటి.. గీతూని బ్రేక్‌ చేసింది. ఇక్కడే గేమ్‌ హీటెక్కింది. చంటి తన ఫోటోని బ్రేక్‌ చేయడంతో మండిపోయిన గీతూ ఫైర్‌ అవుతూ హాట్‌ కామెంట్‌ చేసింది. 

గేమ్‌ ఆడరాని వాళ్లు కూడా ఇలా నా గురించి మాట్లాడుతుంటే కామెడీగా ఉందని రెచ్చగొట్టేలా మాట్లాడుతూ ఆమె బాత్‌ రూమ్‌లోకి వెళ్లిపోయింది. ఇది విన్న చంటి ఫైర్‌ అయ్యాడు. గేమ్ ఆడరాదా? ఏ గేమ్ అంటూ మండి పడ్డాడు. బిగ్‌ బాగ్‌ ఇచ్చేవే గేమ్‌లు అనుకుంటున్నావని, నీకు తెలిసింది షెటాక్‌, దాన్నే ఎంతో పెద్దగా అనుకుంటున్నావ్‌ అని గట్టిగా కౌంటర్‌ ఇచ్చాడు. దీన్నే ప్రోవోకింగ్‌(రెచ్చగొట్టడం) అంటూ, దా కొట్టుకుందాం, చాలా రోజులవుతుంది కొట్టుకోకా అంటూ తనదైన స్టయిల్‌లో రెచ్చిపోయాడు చంటి. దీంతో ఇద్దరి మధ్య హాట్‌ హాట్‌ గా వాగ్వాదం జరిగింది. ఇదే ఈ ఎపిసోడ్‌కి హైలైట్‌గా నిలిచింది. 

అంతకు ముందు ఆదిరెడ్డి.. గీతూకి ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నానని, అందుకే తాను తనని బ్రేక్ చేయడం లేదని తెలిపాడు. అనంతరం గార్డెన్‌లో కూర్చొని ముచ్చటిస్తుండగా, పక్కకు వచ్చిన గీతూ.. ఆది రెడ్డి చెవి వద్ద వాగుతా ఉంటుంది. దీంతో మండిపోయిన ఆదిరెడ్డి ఒక్కసారిగా ఫైర్‌ అయ్యాడు. తప్పు చేశా బిగ్‌ బాస్. మరో ఛాన్స్ ఇవ్వండి బిగ్ బాస్‌ గీత గువ్వ పగలగొడతాను. పక్కని చేసి ఓవాగుతా ఉందని వాపోయాడు. ఇది నవ్వులు పూయించింది. 

దీనికంటే ముందు సింగర్‌ రేవంత్‌ భార్య సీమంతం జరిగిన వీడియోని చూపించారు బిగ్‌బాస్‌. రేవంత్‌కి ప్రత్యేకంగా ఈ వీడియోని చూపించాడు. సీమంతం జరుగుతున్న వీడియోనిచూసి రేవంత్ భావోద్వేగానికి గురయ్యాడు. భార్యతో లేనందుకు బాధపడ్డాడు. తాను కష్టపడి ఆడి కప్‌ గెలుచుకుని డెలివరి అయ్యాక ఈ గిఫ్ట్ ఇస్తానని తెలిపాడు. సీమంతం సదర్భంగా తాను కూడా కొన్ని పళ్లు ప్యాక్‌ చేసి భార్యకి పంపించాడు రేవంత్‌. 
 

Follow Us:
Download App:
  • android
  • ios