ఆ ఇద్దరు నిర్మాతల కొట్లాట!

fight between two telugu producers
Highlights

మానవ సంబంధాలు తెగి పోవడంలో ఆర్ధిక లావాదేవీలు కీలకపాత్ర పోషిస్తుంటాయి

మానవ సంబంధాలు తెగి పోవడంలో ఆర్ధిక లావాదేవీలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఇప్పుడు అటువంటి ఆర్ధిక కారణాల వలనే ఇద్దరు నిర్మాతలు కొట్టుకునే స్థాయికి వెళ్లారని తెలుస్తోంది. ఇద్దరు నిర్మాతలు కలిసి ఓ కమెడియన్ ను హీరోగా పెట్టి సినిమా తీశారు. ఈ శుక్రవారమే ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా ప్రమోషన్స్ లో కూడా ఈ ఇద్దరు నిర్మాతలు బాగానే పాల్గొన్నారు.

తాజాగా సినిమా ఆర్ధిక లావాదేవీల విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు చోటుచేసుకున్నాయని తెలుస్తోంది. ఒక నిర్మాత డబ్బు తినేశాడనే ఆరోపణతో మరో నిర్మాత గొడవకు దిగాడట. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో ఆఫీస్ లోనే కొట్టుకునే స్థాయికి వెళ్లినట్లు సమాచారం. డబ్బు తినేసిన నిర్మాత మరో నిర్మాతపై చేయి చేసుకోవడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

అయితే సదరు నిర్మాతకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ ఉండడంతో ఫిర్యాదు చేసిన ధీమాగా ఉన్నాడట. మరి ఈ గొడవ కారణంగా సినిమా రిలీజ్ పై ఏదైనా ప్రభావం పడుతుందేమో చూడాలి!

loader