సలార్, డంకీ విడుదలకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం యూఎస్ఏలో ఈ రెండ్ భారీ ప్రాజెక్ట్స్ మధ్య ఫైట్ మొదలైంది. రిలీజ్ కు ముందుకు అడ్వాన్స్ సేల్స్ లెక్కల్లో డార్లింగ్ ఊహకందని రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటున్నారు. 

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కు గత చిత్రాలు ఆశించిన మేర ఫలితానివ్వలేకపోయాయి. ప్రస్తుతం సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న Salaar Cease Fireపై భారీ అంనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ కు మాసీవ్ రెస్పాన్స్ దక్కింది. తమరోవైపు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ (Shah Rukh Khan) వరుసగా ‘పఠాన్’, ‘జవాన్’తో వెయ్యికోట్ల కలెక్షన్ రాబట్టి అదరహో అనిపించారు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ (RajKumar Hirani) దర్శకత్వంలోని ‘డంకీ’ Dunkiతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తున్నారు. 

ముందుగా ఈ రెండు చిత్రాలకు రిలీజ్ డేట్స్ లో క్లాష్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఎవరూ వెనక్కి తగ్గలేదు. దీంతో ఇండియన్ సినిమాలో బిగ్ క్లాష్ ఏర్పడింది. డిసెంబర్ 21న ‘డంకీ’, డిసెంబర్ 22న ‘సలార్’ ఒక్కరోజు తేడాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏ చిత్రానికి హై రెస్పాన్స్ వస్తుంది.. బాక్సాఫీస్ కలెక్షన్లు అదిరిపోతాయనే అంశం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో యూఎస్ఏలో అడ్వాన్స్ సేల్స్ లో సలార్ వర్సెస్ డంకీ కొనసాగుతోంది. 

ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు.. డిసెంబర్ 21 నాటికి ‘డంకీ’ డే1గా యూఎస్ఏలో ఆడనుంది. సలార్ ప్రీమియర్స్ ను ప్రదర్శించనుంది. అయితే ఆ రోజు నుంచే ఈ రెండు ఫిల్మ్స్ పోటీపడుతున్నాయి. USA Boxoffice వద్ద ప్రీ సేల్స్ పై తాజాగా అందిన రిపోర్ట్స్ ప్రకారం ‘డంకీ’ కంటే ‘సలార్’కు భారీ రెస్పాన్స్ కనిపిస్తోంది. ఆ లెక్కలు ఇలా ఉన్నాయి. 

యూఎస్ఏ అడ్వాన్స్ సేల్స్ : 

సలార్ ప్రీమియర్
గ్రాస్ - 846,216 డాలర్లు
లోకేషన్లు - 415
షోలు - 1331
టిక్కెట్లు - 31833

డంకీ మొదటి రోజు (Day 1)

గ్రాస్ - $155,256
లోకేషన్లు - 433
షోలు - 1226
టిక్కెట్లు - 11300

యూఎస్ఏ అడ్వాన్స్ సేల్స్ లో సలార్ కు భారీ టికెట్లు అమ్ముడుపోయాయి. ఇంకా నాలుగు రోజుల సమయం ఉండటంతో ఈ లెక్కలు 1 కోటీని రీచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. అడ్వాన్స్ సేల్స్ తో డంకీ మాత్రం ఆరోజు డల్ గానే కనిపిస్తోంది. ఇక సినిమా టాక్ ను బట్టి మున్ముందు రిజల్ట్ ఎలా ఉంటుందనే చూడాలి. ప్రస్తుతం ‘డంకీ’, ‘సలార్’ టీమ్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీ అయ్యింది.