ఫిదా` చూసి ఫిదా అయిన సీఎం కె.సి.ఆర్‌.. మిలియన్ డాలర్ క్లబ్ లో ఫిదా

fidaa joins million dollars club cm kcr appreciates
Highlights

  • యుఎస్ లో మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిన ఫిదా
  • ఫిదా మూవీకి ఫిదా అయిపోయిన తెలంగాణ సీఎం కేసీఆర్
  • ఫిదా టీమ్ కు అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్

వ‌రుణ్ తేజ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ `ఫిదా`. జూలై 21న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌లైన ఈ చిత్రం సెన్సేష‌న‌ల్ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వ‌ద్ద స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. యు.ఎస్‌లో ఇప్ప‌టికే `ఫిదా` మిలియ‌న్ డాల‌ర్స్ క్ల‌బ్‌లోకి చేరింది.

 

స్వ‌తంత్ర్య భావాలున్న ఓ తెలంగాణ అమ్మాయికి, ఎన్నారై యువ‌కుడి మ‌ధ్య జ‌రిగే అంద‌మైన ప్రేమ‌క‌థ‌, కుటుంబ ప‌ర‌మైన భావోద్వేగాలు యువ‌త‌, కుటుంబ‌క‌థా చిత్రాల ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటున్నాయి. అంద‌రినీ మెప్పిస్తున్న ఈ సినిమాను తెలంగాణ ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ప్ర‌త్యేకంగా వీక్షించారు.

 

సినిమా చాలా చ‌క్క‌గా ఉంద‌ని, ద‌ర్శ‌కుడు  శేఖ‌ర్ క‌మ్ముల‌, నిర్మాత దిల్‌రాజు సినిమాను అద్భుతంగా రూపొందించారని,న‌టీన‌టులు చ‌క్క‌గా న‌టించార‌ని అప్రిసియేట్ చేసిన కె.సి.ఆర్‌. వీలు చూసుకుని చిత్ర యూనిట్ త‌న‌ను క‌ల‌వాల‌ని ఆహ్వానించారు.

TODAY'S POLL

బిత్తిరి సత్తి శ్రీ ముఖిపై అతిగా కామెంట్ చేశాడా?

loader