12 రోజులు పడుకొమ్మన్నారు.. కారు,ఫ్లాట్ అన్నీ ఇస్తామన్నారు

fidaa fame gayatri sensational comments on casting couch in industry
Highlights

  • కాస్టింగ్ కౌచ్ పై మరోసారి ఆవేదన వెలిబుచ్చిన ఫిదా గాయత్రి
  • ఇటీవలే ఓ యుట్యూబ్ ఛానలె ఇంటర్వ్యూలో దీనిపై గాయత్రి స్పందన
  • మరోసారి కాస్టింగ్ కౌచ్ పై ఓ ఛానెల్ డిస్కషన్ లో తన అనుభవాలు పంచుకున్న గాయత్రి

ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ సంచలనం ఎవరంటే ఫిదా ఫేం గాయత్రి. దశాబ్ద కాలంగా ఇండస్ట్రీలో వున్నా ఫిదా' సినిమాతో గానీ పాపులర్ కాలేకపోయిన నటి గాయిత్రి గుప్తా. ఈ చిత్రంలో హీరోయిన్ సాయి పల్లవి ఫ్రెండ్ పాత్ర పోషించింది. గాయిత్రి ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌లో ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ గురించి ధైర్యంగా బయట పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ టీవీ ఛానల్ 'కాస్టింగ్ కౌచ్' అంశం గురించి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న గాయిత్రి గుప్తా... మరోసారి తనకు ఎదురైన అనుభాలను వివరించారు.

 

సినిమా నిర్మాత, డైరెక్టర్, ఆర్టిస్టులు కాకుండా మేనేజర్స్ లెవల్లోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ మొదలవుతాయన్నారు. వాళ్లు మనల్ని ఒక సినిమా కోసం సంప్రదించినపుడు కమిట్మెంటుకు (పడుకోవడానికి) ప్రిపేర్ అయి ఉన్నావా? లేదా? అని ముందే ఎలాంటి మొహమాటం లేకుండా అడిగేస్తారు.. అని గాయిత్రి గుప్తా తెలిపారు.

 

అసలు మూవీ అనేది ఒక కళ. సినిమాల్లో అవకాశం ఇవ్వాలంటే నీకు యాక్టింగ్ టాలెంట్ ఉందా? సింగింగ్ టాలెంట్ ఉందా? డాన్సింగ్ టాలెంట్ ఉందా? అని చూడాలి. కానీ అది(పడుకోవడం) దానికి అర్హత ఎలా అవుతుంది? దానికోసం ఒక సెక్టర్ ఉంది కదా? అంటూ... గాయిత్రి గుప్తా ప్రశ్నించారు.

 

అందరూ అలా ఉన్నారని అనడం లేదు. నేను ఇప్పటి వరకు 11 సినిమాలు చేశాను. అందులో హిట్టయిన మూవీ ‘ఫిదా'. ఇండస్ట్రీలో అలాంటి వారు కొంత మంది అయితే ఉన్నారు. ఆ కొంత మంది కూడా ఆడ పిల్ల తన పరువు కోసం బయటకు మాట్లాడదు కదా అనే ఉద్దేశ్యంతో ఇలాంటివి చేస్తుంటారు. ఇది ఎక్కడైనా జరుగుతుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉంటుంది అని గాయిత్రి గుప్తా తెలిపారు. ఇక్కడ అలాంటి సంఘటనలు ఎదురైతే ఎవరికి కంప్లయింట్ చేయాలో కూడా చాలా మందికి తెలియదు. వారు ఇష్టంతో చేయరు. తెలియక చేసి అందులో పడిపోతుంటారు... అని గాయిత్రి గుప్తా తెలిపారు.

 

రెండేళ్ల క్రితం ఓ బాలీవుడ్ మూవీ ఆఫర్ కూడా వచ్చిందని... మంచి క్యారెక్టరని అయితే.. 12 రోజులు కమిట్మెంట్ ఇస్తే ఒక ప్లాట్ గిఫ్ట్ ఇస్తాను, ఒక కారు కొనిస్తాను, 10 లక్షల పేమెంట్ ఇస్తామని చెప్పటంతో ఆఫర్ వద్దని చెప్పి వచ్చేశానని గాయిత్రి గుప్తా తెలిపారు. 12 డేస్ కమిట్మెంట్ అంటే ఏమిటి? 12 రోజులు నటించడమా? అని యాంకర్ ప్రశ్నించగా.. కమిట్మెంట్ అంటే 12 రోజులు వారితో పడుకోవాలి అని గాయిత్రి గుప్తా తెలిపారు. అప్పటి నుండి మేనేజర్స్‌ ను కలవడం మానేశాను అని గాయిత్రి గుప్తా తెలిపారు.

loader