సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తో సన్నిహిత సంబంధాలున్న ప్రతి ఒక్కరినీ సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. సుశాంత్ గురించి వాళ్లకు తెలిసిన విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. కాగా సుశాంత్ ఫ్రెండ్ మరియు ఫ్లాట్ మేట్ అయిన సిద్దార్థ్ పితానిని అధికారులు విచారించడం జరిగింది. ఆ సమయంలో ఆయన కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టారు. జూన్ 8న రియా చక్రవర్తి బాంద్రాలోని సుశాంత్ ప్లాట్ నుండి వెళ్ళిపోయింది. అదే రోజు వీరిద్దరి మధ్య సంఘర్షణ జరిగినట్లు సిదార్థ్ తెలియజేశారు. 

అలాగే రియా ఇంటినుండి వెళ్లిపోవడానికి ముందు దాదాపు 8 హార్డ్ డిస్కులలోని సమాచారాన్ని తొలగించడం జరిగింది. ఇది సుశాంత్, రియా సమక్షంలోనే జరిగింది. సుశాంత్ ఇంటిలో పనివారికి కూడా ఈ విషయం తెలుసని సిద్దార్ధ్ తెలియజేశారు. ఓ ఐటీ ప్రొఫెషనల్ ని ఈ పని కోసం వారిద్దరూ పిలిపించారని, ఆ ఇన్ఫర్మేషన్ డిలేట్ చేసే ముందు కాపీ చేశారని ఆయన చెప్పారు. 

8 హార్డ్ డిస్కుల నుండి తొలగించబడిన ఆ సమాచారం ఏమిటో మాత్రం తనకు తెలియదని సిద్దార్థ్ చెప్పడం జరిగింది. దీనితో రియా, సుశాంత్ 8 హార్ట్ డిస్కులోని సమాచారం ఎందుకు డిలీట్ చేశారు. ఆ హార్డ్ డిస్క్ లలో ఏముంది అనే  అనుమానాలు మొదలయ్యాయి. ఆ హార్డ్ డిస్క్ ల సమాచారాన్ని రియా తన వద్ద ఉంచుకునే అవకాశం కలదని కొందరు భావిస్తున్నారు. రోజురోజుకు ఈ కేసు మరింత క్లిష్ట తరంగా మారుతుండగా, చివరికి ఎక్కడ ఆగుతుంతో అర్థం కావడం లేదు.