మరికొన్ని గంటల్లో పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ఆహాలో ప్రసారం కానుంది. పార్ట్ 1 దుమ్మురేపిన నేపథ్యంలో సెకండ్ పార్ట్ పై ఎక్కడలేని హైప్ ఏర్పడింది. 

బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ షో సంచలనాలకు వేదిక అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ వంటి మితభాషి గెస్ట్ గా రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అందులోనూ పవన్ స్టార్ హీరో అండ్ పొలిటీషియన్. జీవితంలో అనేక వివాదాలు, సమాధానం లేని ప్రశ్నలు, ప్రత్యర్థుల ఆరోపణలు ఉన్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతుండగా... వాటన్నింటికీ సమాధానం చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఆ ఉద్దేశంతోనే అన్ స్టాపబుల్ షోలో అడుగుపెట్టారు. 

ఊహించినట్లే కొన్ని వివాదాస్పద ప్రశ్నలు చర్చకు వచ్చాయి. ఎపిసోడ్ పార్ట్ 1లో పవన్ మూడు పెళ్లిళ్ల వ్యవహారం చర్చకు వచ్చింది. పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. నేనేమీ సరదా పడి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు. ఒకరితో మరొకరికి కుదరనప్పుడు చట్టబద్ధంగా విడాకులు ఇచ్చి మరో వివాహం చేసుకున్నానని సమాధానం చెప్పారు. దాంతో పాటు సినిమాల్లోకి రావాలనే నిర్ణయం ఎవరిది? వచ్చాక జరిగిన మానసిక సంఘర్షణ? అన్నయ్య చిరంజీవి ఫ్యామిలీతో సాన్నిహిత్యం, సంబంధాలు... వంటి ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. 

Scroll to load tweet…

కాగా సెకండ్ పార్ట్ లో మరిన్ని విశేషాలు ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా పొలిటికల్ ఆరోపణలు పై ఆయన నోరు విప్పాడట. బాలకృష్ణ అడిగిన ఘాటైన ప్రశ్నలకు పవన్ పవర్ ఫుల్ ఆన్సర్స్ ఇచ్చారట. నేడు అనగా ఫిబ్రవరి 9న పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ ఎపిసోడ్ పార్ట్ 2 రాత్రి 9 గంటలకు ఆహా లో ప్రసారం కానుంది. ఈ ఎపిసోడ్ కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు.