బాలీవుడ్ లో ఈ ఏడాది అత్యంత భారీ బడ్జెట్ తో వచ్చిన చిత్రం థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. విడుదలకు ముందు ఈ సినిమా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. తెలుగులో కూడా సినిమాను రిలీజ్ చేసే ప్రమోషన్స్ కూడా చేశారు. కానీ సినిమా మొదటి షోకే నెగిటివ్ రాక్ ను అందుకుంది. 

అయితే సినిమా రిజల్ట్ పై రీసెంట్ గా నటి ఫాతిమా షేక్ స్పందించింది. అమ్మడు దంగల్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ సినిమాలో కూడా ఒక కీలక పాత్రలో నటించింది. ఇక సినిమా అపజయాన్ని అమ్మడు బహిరంగంగానే ఒప్పుకుంది. సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం కానీ ఇలా అవుతుందని అనుకోలేదని చెప్పింది. 

అలాగే సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనయ్యిందని వివరణ ఇచ్చింది. ఇక ఈటివల అమిర్ ఖాన్ కూడా సినిమా రిలీజ్ట్ పై ఓపెన్ గా స్పందించాడు. అభిమానులు ఎంతో నమ్మకం పెట్టుకొని సినిమాకు వచ్చారు., వారిని సినిమా చాలా నీరాశపరిచింది. పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను అంటూ నెక్స్ట్ మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని అమిర్ సమాధానం ఇచ్చాడు.